SRPT: ఎస్ఐ అత్యుత్సాహం.. భార్య ముందే భర్తపై దాడి

by Gantepaka Srikanth |   (  Updated:2025-05-30 04:50:48  IST  )

తప్పుడు దారిలో వెళుతున్న వారిని సరిచేయాల్సిన పోలీసులే తప్పుదారి పడుతున్నారు.

SRPT: ఎస్ఐ అత్యుత్సాహం.. భార్య ముందే భర్తపై దాడి
X

దిశ, వెబ్‌డెస్క్: తప్పుడు దారిలో వెళుతున్న వారిని సరిచేయాల్సిన పోలీసులే తప్పుదారి పడుతున్నారు. రోజుకో చోట పోలీసుల అత్యుత్సాహాలకు సంబంధించిన వార్తలు వెలుగుజూస్తున్నాయి. పైఅధికారులు యాక్షన్ తీసుకుంటున్నా.. ఈ తరహా ఘటనలు తగ్గడం లేదు. తాజాగా ఇలాంటి ఘటనే సూర్యాపేట(Suryapet) జిల్లాలో చోటుచేసుకుంది. పెన్ పహాడ్ ఎస్ఐ గోపికృష్ణ అత్యుత్సాహం ప్రదర్శించారు. భార్యాభర్తల కేసులో భార్య ముందే భర్తపై చేయి చేసుకున్నారు. దీంతో తీవ్ర మనస్థాపం చెందిన భర్త నాగార్జున.. పోలీస్ స్టేషన్‌లోనే పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. దీంతో భయాందోళన చెందిన పోలీసులు విషయం బయటకి పొక్కకుండా సైలెంట్‌గా ఆస్పత్రికి తీసుకెళ్లి బాధితుడికి చికిత్స చేయిస్తున్నారు. బాధితుడు నాగార్జున స్వస్థలం పెన్ పహాడ్ మండలం దోసపహాడ్ గ్రామం. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story