- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఏపీలో దారుణం..ఉద్యోగం ఇప్పిస్తామని రూ.2 లక్షల టోకరా, ప్రశ్నించడంతో దాడి
ఏపీలో దారుణం చోటు చేసుకుంది. ఉద్యోగం ఇప్పిస్తామని ఓ యువకుడిని నమ్మించి రూ.2 లక్షలు తీసుకున్నారు. ఉద్యోగం ఇవ్వకపోవడంతో తన డబ్బులు తనకు ఇవ్వాలని ప్రశ్నించగా అతడిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు.

దిశ, వెబ్ డెస్క్: ఏపీలో దారుణం చోటు చేసుకుంది. ఉద్యోగం ఇప్పిస్తామని ఓ యువకుడిని నమ్మించి రూ.2 లక్షలు తీసుకున్నారు. ఉద్యోగం ఇవ్వకపోవడంతో తన డబ్బులు తనకు ఇవ్వాలని ప్రశ్నించగా అతడిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. దాడి చేస్తున్న సమయంలో వీడియో తీయడంతో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఈ ఘటన ఏపీలోని అమలాపురంలో చోటు చేసుకుంది. మున్సిపాలిటీలో ఉద్యోగం ఇప్పిస్తామని మహేశ్ అనే దళిత యువకుడి వద్ద రూ.2 లక్షలు మోసం చేశారు.
డబ్బులు తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేయడంతో అతడిపై కర్రలు, బెల్టుతో దాడి చేశారు. ఈ ఘటనలో మహేశ్ తీవ్రంగా గాయపడగా మంత్రి వాసంశెట్టి సుభాష్ అనుచరులే దాడి చేసినట్టు ఆరోపణలు వస్తున్నాయి. అయితే ఈ ఆరోపణలపై స్పందించిన మహేశ్ తనపై శంకర్ అనే వ్యక్తి దాడికి పాల్పడ్డాడని చెప్పారు. అతడే డబ్బులు తీసుకుని తనను మోసం చేశాడని తెలిపాడు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన ఈ ఘటనపై విచారణ జరిగితే అసలు నిజాలు బయటపడే అవకాశం ఉంది. వీడియో






