మల్నాడు డ్రగ్స్ కేసు.. హైకోర్టులో పబ్ యజమానుల క్వాష్ పిటిషన్

by Kema Shiva Kumar |

మల్నాడు రెస్టారెంట్‌పై ఈగల్ టీం (Eagle Team) ఆకస్మిక దాడులు చేసిన విషయం తెలిసిందే.

మల్నాడు డ్రగ్స్ కేసు.. హైకోర్టులో పబ్ యజమానుల క్వాష్ పిటిషన్
X

దిశ, వెబ్‌డెస్క్: మల్నాడు రెస్టారెంట్‌పై ఈగల్ టీం (Eagle Team) ఆకస్మిక దాడులు చేసిన విషయం తెలిసిందే. మొత్తం మూడు పబ్‌‌లో డ్రగ్స్ పార్టీ నిర్వహిస్తున్నారంటూ పబ్ యజమానులపై కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. తమపై నమోదైన కేసులను కొట్టివేయాలని కోరుతూ.. క్వాక్ పబ్ యజమాని రాజశేఖర్, కోరా పబ్ ఓనర్ పృథ్వీ వీరమాచినేని, బ్రాడ్‌వే పబ్ యజమాని రోహిత్ మాదిశెట్టి‌ తాజాగా రాష్ట్ర అత్యున్న న్యాయస్థానం హైకోర్టు (High Court)లో క్వాష్ పిటిషన్ (Quash Petition) దాఖలు చేశారు. ఈ నేపథ్యంలోనే పోలీసులు వారిపై కేసులు కొట్టివేయకూడదని, తమ వద్ద పూర్తి సాక్ష్యాధారాలు ఉన్నాయని కౌంటర్ పిటిషన్ కూడా దాఖలు చేశారు. మరోవైపు మల్నాడు రెస్టారెంట్ ఓనర్ సూర్య, స్నేహితుడు రాహుల్ తేజ్‌లు ముందస్తు బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారు.

సంచలన విషయాలు వెలుగులోకి..

మ‌ల్నాడు రెస్టారెంట్ య‌జ‌మాని సూర్య డ్రగ్స్ సరఫరాతో పాటు పలు పబ్‌ల నిర్వహకులతో కలిసి డ్రగ్స్ పార్టీలు నిర్వహించినట్టు ఈగల్ టీం నిర్ధారించింది. అదేవిధంగా అతడిని కస్టడీలోకి తీసుకుని విచారించగా సంచలన విషయాలు వెలుగులోకి వ‌స్తున్నాయి. క్వాక్ పబ్ యజమాని రాజశేఖర్, కోరా పబ్ ఓనర్ పృథ్వీ వీరమాచినేని, బ్రాడ్‌వే పబ్ యజమాని రోహిత్ మాదిశెట్టి‌ సూర్యకు ఫైనాన్షిల్ రిలేషన్ ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. వారంతా కలిసి డ్రగ్స్ పార్టీలు కూడా కండక్ట్ చేసినట్లుగా ఈగల్ టీమ్ బయటపెట్టింది. ఈ కేసులో మరో నాలుగు పబ్‌ల యజమానుల పాత్రపైనా కూడా విచారణ కొనసాగుతోంది

Next Story