- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గంజాయి విక్రయిస్తున్న వ్యక్తి అరెస్టు
ఒడిషా నుండి గంజాయి తీసుకొచ్చి హైదరాబాద్ లో విక్రయిస్తున్న ముఠాను మల్కాజ్ గిరి ఎస్ఓటీ పోలీసులు అరెస్ట్ చేశారు.

దిశ, మేడిపల్లి: ఒడిషా నుండి గంజాయి తీసుకొచ్చి హైదరాబాద్ లో విక్రయిస్తున్న ముఠాను శుక్రవారం రాత్రి మల్కాజ్ గిరి ఎస్ఓటీ పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఒడిషాకు చెందిన ప్రశాంత్ అక్కడి నుంచి గంజాయి తీసుకొచ్చి హైదరాబాద్ నగరంలోని మల్లాపూర్ ప్రాంతానికి చెందిన సంతోష్ కుమార్ తో కలిసి గుట్టు చప్పుడు కాకుండా నగరానికి తీసుకొచ్చి విక్రయిస్తున్న ముఠాని శుక్రవారం రాత్రి మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిదిలో మల్కాజ్‌గిరి ఎస్ఓటీ పోలీసులు గంజాయి స్వాధీనం చేసుకొని అరెస్టు చేశారు.ఒడిషా ప్రంతానికి చెందిన ప్రశాంత్, హైదరాబాద్ నగరంలోని మల్లాపూర్ ప్రాంతానికి చెందిన సంతోష్ ఓ ముఠాగా ఏర్పడ్డారు. ప్రశాంత్ ఒడిషా నుంచి తెచ్చిన గంజాయిని ఇద్దరు కలిసి ఐఓసీఎల్ ఎదురుగా ఉన్న సంతోష్ హోటల్ లో విక్రయిస్తున్నారు. సమాచారం అందుకున్న మల్కాజ్ గిరి ఎస్ఓటీ ఎస్ఐ జి.రఘురాముడు ఆధ్వర్యంలోని బృందం.. గంజాయి విక్రయిస్తున్న సంతోష్ ను అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద నుంచి 1.5 కిలోల గంజాయి, ఓ ఫోన్, రూ.5,500 స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న ప్రశాంత్ కోసం పోలీసులు గాలింపు చేపట్టారు.






