డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన ‘దసరా’ విలన్‌కు బెయిల్

by Gantepaka Srikanth |

డ్రగ్స్ కేసు(Drugs Case)లో అరెస్ట్ అయిన మలయాళ నటుడు టామ్ చాకో(Tom Chacko)కు భారీ ఉపమశనం లభించింది.

డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన ‘దసరా’ విలన్‌కు బెయిల్
X

దిశ, వెబ్‌డెస్క్: డ్రగ్స్ కేసు(Drugs Case)లో అరెస్ట్ అయిన మలయాళ నటుడు టామ్ చాకో(Tom Chacko)కు భారీ ఉపమశనం లభించింది. కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. అరెస్ట్ అయిన కొన్ని గంటల్లోనే బెయిల్ రావడంతో ఆయన అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా, శనివారం టామ్‌ చాకోను కేరళ పోలీసులు అరెస్ట్‌ చేశారు. డ్రగ్స్ తీసుకుంటున్నారనే ఆరోపణలతో విచారణకు హాజరైన ఆయన్ను పోలీసులు సుమారు నాలుగు గంటల పాటు ప్రశ్నించారు. అనంతరం అరెస్టు చేశారు. ఆ తర్వాత బెయిల్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది.

అయితే డ్రగ్స్ తీసుకొని తనతో అసభ్యంగా ప్రవర్తించాడని నటి ఫిర్యాదుతో పోలీసులు టామ్‌ను అరెస్ట్ చేశారు. అంతేకాదు.. ఇటీవల కొచ్చిలోని ఓ హోటల్‌లో డ్రగ్స్‌ వినియోగిస్తున్నారన్న సమాచారంతో పోలీసులు ఇటీవల దాడులు చేశారు. అయితే పోలీసుబృందం హోటల్‌కు రావడానికి కొద్దిసేపటి ముందే షైన్‌ టామ్‌ చాకో అక్కడి నుంచి పారిపోయినట్లు వార్తలు వచ్చాయి. హోటల్ మూడో అంతస్తులో ఉన్న అతను.. కిటికీలోంచి రెండో అంతస్తులోకి దూకి అక్కడినుంచి పారిపోతున్న దృశ్యాలు నెట్టింట వైరల్‌ అయ్యాయి.

Next Story