- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
IPL టికెట్ల పేరుతో బిగ్ స్కామ్.. 600ల నకిలీ వెబ్‌సైట్ల గుర్తింపు
ఐపీఎల్ 2026 అభిమానులే లక్ష్యంగా సాగుతున్న భారీ సైబర్ మోసాల పట్ల క్లౌడ్‌సెక్ (CloudSEK) హెచ్చరికలు జారీ చేసింది.

దిశ, వెబ్‌డెస్క్: దేశానికి ఐపీఎల్ (IPL) ఫీవర్ పట్టుకోవడంతో సైబర్ నేరగాళ్లు అమాయకులను నిండా ముంచేందుకు రంగంలోకి దిగారు. గ్రౌండ్‌లో సిక్సర్లు, ఫోర్ల వర్షం కురుస్తుంటే, బయట మాత్రం అభంశుభం తెలియని క్రికెట్ అభిమానులను లక్ష్యంగా చేసుకుని భారీ స్కామ్‌లు జరుగుతున్నాయి. దీనిపై తాజాగా ప్రముఖ సైబర్ సెక్యూరిటీ సంస్థ క్లౌడ్‌సెక్ (CloudSEK) ఆందోళనకరమైన నివేదికను విడుదల చేసింది.
600కు పైగా నకిలీ వెబ్‌సైట్లు..
టికెట్ల కోసం ఉన్న విపరీతమైన డిమాండ్‌ను ఆసరాగా చేసుకుని సుమారు 600కు పైగా నకిలీ వెబ్‌సైట్లను సైబర్ నిపుణులు గుర్తించారు. ఇవి అచ్చం బుక్‌మైషో (BookMyShow) వంటి అధికారిక ప్లాట్‌ఫారమ్‌లను పోలి ఉండటంతో అభిమానులు ఈజీ బుట్టలో పడిపోయి మోసపోతున్నారు. తక్కువ ధరకు టికెట్లు, బ్లాక్ టికెట్లు ఇస్తామని నమ్మించి నేరగాళ్లు రూ.లక్షల్లో దండకుంటున్నారు. అదేవిధంగా ఏపీఎల్ మ్యాచ్‌లను ఉచితంగా లైవ్ చూడొచ్చంటూ సోషల్ మీడియాలో 400కు పైగా ప్రమాదకరమైన స్ట్రీమింగ్ లింకులు చక్కర్లు కొడుతున్నాయి. ఈ లింకులపై క్లిక్ చేయగానే వినియోగదారుల ఫోన్లు, పీసీల్లోకి మాల్‌వేర్ ప్రవేశిస్తుంది. దీంతో యూజర్ బ్యాంకింగ్ డీటెయిల్స్, పాస్‌వర్డ్స్, పర్సనల్ డేటా నేరగాళ్లకు చేరుతోందని క్లౌడ్‌సెక్ హెచ్చరించింది.
పోలీసుల కీలక సూచనలు..
సైబర్ దాడుల బారిన పడకుండా ఉండటానికి పోలీసులు, టెక్ పలు సూచనలు చేస్తున్నారు. ఐపీఎల్ టికెట్లను కేవలం అధికారిక వెబ్‌సైట్ లేదా అనుమతి పొందిన అఫీషియల్ పార్ట్‌నర్ యాప్‌ల ద్వారా మాత్రమే కొనుగోలు చేయాలని సూచిస్తున్నారు. వాట్సాప్, సోషల్ మీడియాలో వచ్చే ఉచిత లైవ్ స్ట్రీమింగ్ లింక్‌లను పొరపాటున కూడా క్లిక్ చేయవద్దని తెలిపారు. ఏదైనా కొత్త వెబ్‌సైట్‌లో క్రెడిట్, డెబిట్ కార్డ్ వివరాలను ఇచ్చే ముందు అది సురక్షితమా లేదా సరిచూసుకోవాలని తెలిపారు. నార్మల రేట్ కంటే చాలా తక్కువ ధరకే టికెట్లు ఆఫర్ చేస్తున్నారంటే అది కచ్చితంగా స్కామ్ అని గ్రహించాలని పోలీసులు, టెక్ నిపుణుల సూచిస్తున్నారు.






