తిరుపతిలో భారీ అగ్నిప్రమాదం.. ‘రాసా కంపెనీ’లో ఎగసిపడుతోన్న మంటలు

by Kema Shiva Kumar |

తెలుగు రాష్ట్రాలను వరుస అగ్ని ప్రమాదాలు కలవరపెడుతున్నాయి. తిరుపతి జిల్లా గాజులపెళ్లూరులోని రాసా కంపెనీలో ఇవాళ రాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించింది

తిరుపతిలో భారీ అగ్నిప్రమాదం.. ‘రాసా కంపెనీ’లో ఎగసిపడుతోన్న మంటలు
X

దిశ, వెబ్‌డెస్క్: తిరుపతి జిల్లాలోని గాజులపెళ్లూరులో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. స్థానిక పారిశ్రామిక ప్రాంతంలోని ‘రాసా’ (Rasa) కంపెనీలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. పరిశ్రమలోని నాలుగు ప్రధాన చాంబర్లతో పాటు పక్కనే ఉన్న స్క్రాప్ గోడౌన్‌కు కూడా మంటలు వేగంగా విస్తరించాయి. గోడౌన్‌లో ప్లాస్టిక్, ఇతర మండే స్వభావం గల వస్తువులు ఉండటంతో మంటలు ఆకాశాన్నంటాయి. భారీగా నల్లటి పొగ రావడంతో పరిసర ప్రాంతాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఫైర్ ఇంజన్ల సహాయంతో మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ప్రమాద సమయంలో కంపెనీలో ఎంతమంది కార్మికులు ఉన్నారనేది ఇంకా తెలియాల్సి ఉంది.

Next Story