దేశ రాజధాని ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం.. మంటలను ఆర్పుతోన్న 14 ఫైరింజన్లు

by Kema Shiva Kumar |

వరుస అగ్ని ప్రమాదాలు (Fire Accidents) దేశ రాజధాని ఢిల్లీ (Delhi)లో కలకలం సృష్టిస్తున్నాయి.

దేశ రాజధాని ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం.. మంటలను ఆర్పుతోన్న 14 ఫైరింజన్లు
X

దిశ, వెబ్‌డెస్క్: వరుస అగ్ని ప్రమాదాలు (Fire Accidents) దేశ రాజధాని ఢిల్లీ (Delhi)లో కలకలం సృష్టిస్తున్నాయి. హఠాత్పరిణామాలతో అక్కడి జనం నిత్యం కంటిమీద కునుకు లేకుండా జీవిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇవాళ కేశవ్‌పురం (Keshavpuram) పరిధిలోని లారెన్స్ రోడ్డు (Lawrence Road)లో ఉన్న ఓ ఫ్యాక్టరీలో ఉన్నట్లుండి మంటలు చేలరేగాయి. ఈ పరిణామంతో ఫ్యాక్టరీ నుంచి భారీ ఎత్తున నల్లని పొగ బయటకు వెలువడుతోంది. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మొత్తం 14 ఫైరింజన్లతో భారీగా ఎగసిపడుతోన్న మంటలకు అదుపు చేసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. అయితే, ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు ఆస్తి, ప్రాణ నష్టంపై ఎలాంటి సమాచారం అందలేదు.

Next Story