- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
AP: తిరుమల కొండల్లో భారీ అగ్ని ప్రమాదం
by Gantepaka Srikanth |
తిరుమల(Tirumala)లో భారీ అగ్ని ప్రమాదం(Fire Accident) చోటుచేసుకుంది. శిలాతోరణం, శ్రీవారి పాదాల దగ్గర అకస్మాత్తుగా మంగళవారం మధ్యాహ్నం మంటలు చెలరేగాయి.

X
దిశ, వెబ్‌డెస్క్: తిరుమల(Tirumala)లో భారీ అగ్ని ప్రమాదం(Fire Accident) చోటుచేసుకుంది. శిలాతోరణం, శ్రీవారి పాదాల దగ్గర అకస్మాత్తుగా మంగళవారం మధ్యాహ్నం మంటలు చెలరేగాయి. స్థానికుల సమాచారంతో విషయం తెలుసుకున్న అధికారులు.. రెండు ఫైరింజన్లతో వచ్చి మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. అగ్ని ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా, ఇటీవల ఏపీలో వరుస అగ్ని ప్రమాదాలు ప్రజలను కలవరపాటుకు గురిచేస్తున్నాయి. ఇటీవలే విజయవాడలోని బెంజ్ సర్కిల్ సమీపంలో ఓ భవనంలో మంటలు చెలరేగి ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మృతులు అంతా ఒకే కుటుంబానికి చెందిన వారిగా అధికారులు గుర్తించారు. ఈ ఘటనను మరువకముందే ఏకంగా నేడు సాక్షాత్తు తిరుమలలో అగ్ని ప్రమాదం జరగడం కలకలం రేపుతోంది.
Next Story






