- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నగరంలో భారీ అగ్ని ప్రమాదం.. 11 మందిని కాపాడిన ఫైర్ సిబ్బంది
టీఎన్జీవో కాలనీలోని ఓ భవనం సెల్లార్‌లో మంటలు చెలరేగి ఏకంగా 15 బైక్‌లు కాలిబూడదయ్యాయి.

దిశ, వెబ్‌డెస్క్: సాఫ్ట్‌వేర్ హబ్ గచ్చిబౌలిలో ఇవాళ ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. టీఎన్జీవో కాలనీలోని ఒక భవనం సెల్లార్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఈ ప్రమాదంలో భవన సెల్లార్‌లో పార్క్ చేసి ఉన్న 15 ద్విచక్ర వాహనాలు పూర్తిగా కాలిబూడదయ్యాయి. ప్రాథమిక సమాచారం ప్రకారం.. భవనం సెల్లార్‌లో ఉన్న ఎలక్ట్రికల్ ప్యానెల్ బోర్డులో షార్ట్ సర్క్యూట్ కావడంతో మంటలు మొదలయ్యాయి. సెల్లార్‌లో వరుసగా పార్క్ చేసి ఉన్న బైక్‌లకు ఈ మంటలు వేగంగా వ్యాపించాయి. పెట్రోల్ ట్యాంకులు పేలడంతో మంటల తీవ్రత పెరిగి, భవనం మొత్తాన్ని దట్టమైన పొగ కమ్మేసింది.
ప్రాణాలకు తెగించి 11 మంది రెస్క్యూ..
మంటలు, దట్టమైన పొగ కారణంగా పైఅంతస్తుల్లో ఉన్న వారు బయటకు రాలేక లోపలే చిక్కుకుపోయారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది వెంటనే స్పాట్‌కు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. భవనంలో చిక్కుకున్న 11 మందిని నిచ్చెనల సహాయంతో ఫైర్ సిబ్బంది సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. దట్టమైన పొగ కారణంగా ఊపిరాడక కొందరు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలవ్వగా, మరొకరు పొగ పీల్చడం వల్ల తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. బాధితులను వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సకాలంలో ఫైర్ ఇంజన్లు చేరుకోవడంతో మంటలు పైఅంతస్తులకు వ్యాపించకుండా అరికట్టగలిగారు, లేదంటే భారీ ప్రాణ నష్టం జరిగేదని స్థానికులు చెబుతున్నారు.






