- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భారీ అగ్ని ప్రమాదం.. మంటల్లో చిక్కుకున్న ముగ్గురు
by Gantepaka Srikanth |
దేశ రాజధాని ఢిల్లీ(Delhi)లో భారీ అగ్ని ప్రమాదం(Fire Accident) జరిగింది.

X
దిశ, వెబ్‌డెస్క్: దేశ రాజధాని ఢిల్లీ(Delhi)లో భారీ అగ్ని ప్రమాదం(Fire Accident) జరిగింది. ద్వారకా ప్రాంతంలోని అపార్ట్‌మెంట్(Dwarka Apartments)లో మంటలు చెలరేగాయి. ఆరో అంతస్తు నుంచి భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. భయాందోళన చెందిన అధికారులకు సమాచారం ఇవ్వడంతో 8 ఫైరింజన్లతో వచ్చి మంటలు ఆర్పుతున్నారు. మంటల్లో ముగ్గురు చిక్కుకున్నట్లు సమాచారం. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అగ్ని ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా, వరుస అగ్ని ప్రమాదాలు ఢిల్లీ ప్రజలను కలవరపెడుతన్నాయి. ఇటీవలే ఎలక్ట్రిక్ ఆటో ఛార్జింగ్ కేంద్రంలో అగ్నిప్రమాదం సంభవించి ఇద్దరు యువకులు సజీవ దహనమైన విషయం తెలిసిందే. ఇందులో మరో నలుగురికి కూడా తీవ్రగాయాలు అయ్యాయి. ఈ ఘటన మరువక ముందే మరో అగ్ని ప్రమాదం చోటుచేసుకోవడం హాట్ టాపిక్‌గా మారింది.
Next Story






