కాంకేర్ జిల్లాలో కీలక పరిణామం.. మావోయిస్టు పార్టీ కీలక నేత దస్రు సోఢి సరెండర్

by Kema Shiva Kumar |   (  Updated:2026-04-21 04:10:55  IST  )

మావోయిస్టు పార్టీ నార్త్ బస్తర్ డివిజన్ కమిటీకి చెందిన కీలక నేత దస్రు సోఢి ఇవాళ కాంకేర్ జిల్లా పోలీసుల ఎదుట లొంగిపోయారు.

కాంకేర్ జిల్లాలో కీలక పరిణామం.. మావోయిస్టు పార్టీ కీలక నేత దస్రు సోఢి సరెండర్
X

దిశ, వెబ్‌డెస్క్: దేశంలో మావోయిస్టుల నిర్మూలనే లక్ష్యంగా ఛత్తీస్‌గఢ్‌లోని కాంకేర్ జిల్లా పోలీసులు చేపడుతున్న స్పెషల్ డ్రైవ్ సత్ఫలితాలను ఇస్తోంది. ఈ నేపథ్యంలోనే హింసా మార్గాన్ని వీడి, జనజీవన స్రవంతిలో చేరాలని నిర్ణయించుకున్న నార్త్ బస్తర్ డివిజన్ కమిటీకి చెందిన కీలక నేత (PPCM) దస్రు సోఢి పోలీసుల ఎదుట సరెండర్ అయ్యారు. ప్రభుత్వం రూ.8 లక్షల రివార్డు ప్రకటించిన దస్రు సోఢి, తన వద్దనున్న అత్యంత ప్రమాదకరమైన ఏకే-47 (AK-47) రైఫిల్‌తో సహా కాంకేర్ ఎస్పీ నిఖిల్ రాఖేచా ఎదుట లొంగిపోయారు. పీఎల్జీఏ (PLGA) కంపెనీ నంబర్ 5లో దస్రు సోఢి కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

ఐజీ సుందర్‌రాజ్ మాస్ వార్నింగ్..

అయితే, దస్రు సోఢి లొంగుబాటును బస్తర్ రేంజ్ ఐజీ సుందర్‌రాజ్ స్వాగతించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హింసను వీడి శాంతి మార్గంలోకి రావాలనుకునే వారికి ప్రభుత్వ పునరావాస తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయని అన్నారు. కానీ, అశాంతిని సృష్టించి ప్రజలను ఇబ్బంది పెట్టే వారిపై పోలీసుల రెస్పాన్స్ చాలా భయకరంగా ఉంటుందని వార్నింగ్ ఇచ్చారు. ఇంకా ఎవరైనా ఉంటే.. త్వరగా పోలీసులు ఎదుట లొంగిపోయి జనజీవన స్రవంతిలోకి రావాలని సుందర్‌రాజ్ పిలుపునిచ్చారు.

Next Story