ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో బిగ్ వికెట్.. మాజీ మంత్రి కుమారుడు అరెస్ట్

by Kema Shiva Kumar |   (  Updated:2026-06-18 09:57:17  IST  )

ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కుమారుడు సునీల్‌ను హైదరాబాద్‌లో ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు.

ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో బిగ్ వికెట్.. మాజీ మంత్రి కుమారుడు అరెస్ట్
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) దూకుడు పెంచింది. ఈ మేరకు వైసీపీ నేత, మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కుమారుడు కారుమూరి సునీల్ కుమార్‌ (Sunil Kumarను ఇవాళ ఈడీ అధికారులు హైదరాబాద్‌లో అరెస్ట్ చేశారు. మద్యం రవాణా టెండర్ల దక్కించుకోవడం, నిధుల మళ్లింపులో సునీల్ కీలక పాత్ర పోషించారనే ఆరోపణల నేపథ్యంలో ఆయన అరెస్ట్ అయ్యారు.

మీడియేటర్‌గా వ్యవహరించిన సునీల్..

అయితే వైసీప ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ (APSBCL) ద్వారా జరిగిన రూ.195 కోట్ల మద్యం రవాణా కుంభకోణంలో సునీల్ కుమార్ మీడియేటర్‌గా వ్యవహరించినట్లుగా ఈడీ దర్యాప్తులో తేలింది. లిక్కర్ సిండికేట్ లీడర్లు, స్థానిక కాంట్రాక్టర్లకు మధ్య వారధిగా.. తండ్రికి నాగేశ్వర రావుకు ఉన్న రాజకీయ పలుకుబడిని ఉపయోగించి మద్యం రవాణాకు సంబంధించిన సబ్-కాంట్రాక్టులు దక్కించుకున్నారని సునీల్‌పై ఆరోపణలు ఉన్నాయి. హైదరాబాద్‌లో సునీల్‌ను అరెస్ట్ చేసిన ఈడీ అధికారులు ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం నాంపల్లిలోని పీఎంఎల్‌ఏ (PMLA) ప్రత్యేక కోర్టులో హాజరుపరచనున్నారు. తదుపరి విచారణ నిమిత్తం సునీల్‌ను తమ కస్టడీకి ఇవ్వాలని ఈడీ అధికారులు కోర్టును కోరే అవకాశం ఉంది.

Next Story