- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మామడ వెంకన్న ఆలయంలో భారీ చోరీ
by Batti.Sumithra |
మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో బుధవారం అర్థరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు భారీ చోరీకి పాల్పడ్డారు.

X
దిశ, మామడ : మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో బుధవారం అర్థరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు భారీ చోరీకి పాల్పడ్డారు. గురువారం పూజారి దేవాలయానికి వచ్చి చూడగా గేటు, గర్భగుడి తాళాలు పగలగొట్టి ఉండడంతో కమిటీ సభ్యులకు తెలియజేయగా వారు వచ్చి పోలీసులకు సమాచారం అందించారు. కమిటీ సభ్యులు కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. దుండగులు ఆలయంలో ఉన్న సీసీ కెమెరాలకు సంబంధించిన పరికరాలను ధ్వంసం చేసి, గేటు తాళాలు పగలగొట్టి గర్భగుడిలోకి ప్రవేశించి నాలుగు జతల బంగారు పుస్తెలు, 5 కిలోల పైన వెండి, షఠగోపంలను ఎత్తుకెళ్లారు. ఆలయంలో ఉన్న హుండీని ముట్టుకోలేరు. మొదటిసారిగా ఆలయంలో చోరీ జరగడంతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు.
Next Story






