భూ వివాదం.. ఒకరిని కాల్చి చంపి.. మరొకరిని సజీవదహనం చేసి..

by Sujitha Rachapalli |

బీహార్‌లోని అరారియా జిల్లాలో భూ వివాదం డబుల్ మర్డర్‌కు దారి తీసింది. ఈ ఘటన స్థానికంగా ఉద్రిక్తతను రేపింది. గుడ్డు యాదవ్, అతని బావ మరిది నయన్ యాదవ్‌కు మధ్య రెండున్నర ఎకరాల భూమి విషయంలో జరిగిన గొడవ హత్యలకు దారితీసింది.

భూ వివాదం.. ఒకరిని కాల్చి చంపి.. మరొకరిని సజీవదహనం చేసి..
X

దిశ, వెబ్ డెస్క్ : బీహార్‌లోని అరారియా జిల్లాలో భూ వివాదం డబుల్ మర్డర్‌కు దారి తీసింది. ఈ ఘటన స్థానికంగా ఉద్రిక్తతను రేపింది. గుడ్డు యాదవ్, అతని బావ మరిది నయన్ యాదవ్‌కు మధ్య రెండున్నర ఎకరాల భూమి విషయంలో జరిగిన గొడవ హత్యలకు దారితీసింది. శుక్రవారం పొలం దగ్గర జరిగిన వాగ్వాదం తర్వాత.. శనివారం ఉదయం మూడున్నర గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. భర్గామా పీఎస్ పరిధిలో ఉన్న ధనేశ్వరి పంచాయత్ పదమూడో వార్డులో ఈ దారుణం జరిగింది.

పంచాయత్ సమితీ సభ్యుడైన గుడ్డు యాదవ్‌కు చెందిన దుండగులు గొడవలో పాల్గొన్న నయన్ యాదవ్ బంధువు జైకుమార్ యాదవ్ డిపోలో నిద్రిస్తున్న సమయంలో గన్‌తో కాల్చి చంపినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత నయన్ యాదవ్ ఇంటికి నిప్పంటించగా.. ఇంట్లో నిద్రపోతున్న అతడు మంటల్లో సజీవ దహనమైనట్లు సమాచారం. ఈ ఘటనతో గ్రామంలో ఆందోళనకర వాతావరణం ఏర్పడగా.. శాంతిభద్రతలను కాపాడేందుకు భారీగా మోహరించారు పోలీసులు. రెండు మృతదేహాలను పోస్టుమార్టం కోసం పంపించిన పోలీసులు.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

Next Story