రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం.. కంటైనర్ ఢీకోని నలుగురు దుర్మరణం.. చావు బతుకుల్లో ఇద్దరు

by Sujitha Rachapalli |

మహారాష్ట్ర బీడ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. షోలాపూర్-ధూలే నేషనల్ హైవేపై నామల్గావ్ ఫాటా ఫ్లైఓవర్ సమీపంలో కంటైనర్ ఢీకొని నలుగురు మృతి చెందారు. ఉదయం ఏడున్నర గంటల సమయంలో ఈ ఘటన జరగ్గా.. తీవ్రంగా గాయపడిన మరో ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స

రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం.. కంటైనర్ ఢీకోని నలుగురు దుర్మరణం.. చావు బతుకుల్లో ఇద్దరు
X

దిశ, వెబ్ డెస్క్ : మహారాష్ట్ర బీడ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. షోలాపూర్-ధూలే నేషనల్ హైవేపై నామల్గావ్ ఫాటా ఫ్లైఓవర్ సమీపంలో కంటైనర్ ఢీకొని నలుగురు మృతి చెందారు. ఉదయం ఏడున్నర గంటల సమయంలో ఈ ఘటన జరగ్గా.. తీవ్రంగా గాయపడిన మరో ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. చావు బతుకుల మధ్య పోరాడుతున్నారు. కాగా వీరంతా దర్శనం కోసం పెండ్గావ్ వెళ్తున్నట్లు తెలుస్తోంది. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. కంటైనర్ స్వాధీనం చేసుకున్నారు. డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని విచారించారు. ఇక ఈ ప్రమాదం కారణంగా కాసేపు జాతీయ రహదారిపై రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. కాగా కొద్ది రోజుల క్రితమే గర్హి ఫ్లైఓవర్ సమీపంలోనూ కంటైనర్ ఢీకొని ఐదుగురు మృతి చెందిన విషయం తెలిసిందే. కాగా ఈ రోడ్డు ప్రమాదాలతో జనాల్లో భయాందోళన ఏర్పడింది.

Next Story