- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మొదట అత్యాచారం చేసి, ఆపై.. మదనపల్లె బాలిక పోస్టుమార్టంలో సంచలనాలు
మదనపల్లి బాలిక హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. పోస్టుమార్టం అనంతరం డీఐజీ కోయ ప్రవీణ్ మీడియాతో మాట్లాడారు. చిన్నారిని అత్యాచారం చేసి అనంతరం నీటిలో ముంచి చంపాడన్నారు.

దిశ, వెబ్ డెస్క్: మదనపల్లి బాలిక హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. పోస్టుమార్టం అనంతరం డీఐజీ కోయ ప్రవీణ్ మీడియాతో మాట్లాడారు. చిన్నారిని అత్యాచారం చేసి అనంతరం నీటిలో ముంచి చంపాడన్నారు. ప్రస్తుతం నిందితుడు కులవర్ధన్ తమ అదుపులో లేడని చెప్పారు. నిందితుడి కోసం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నామని అన్నారు. ఉదయం కొందరు కావాలనే గొడవలు సృష్టించారని అన్నారు. దానిపై కూడా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గంజాయిపై అన్నమయ్య జిల్లా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారని అన్నారు.
గంజాయి కట్టడికి పగడ్బందిగా చర్యలు చేపడుతున్నామని తెలిపారు. ఇదిలా ఉంటే బాలిక నిన్నటి నుండి కనిపించకుండా పోయింది. దీంతో బాలిక కోసం గాలించిన తల్లిదండ్రులు పోలీసులు వారి ఇంటిపక్కన ఇంట్లోని వ్యక్తే హత్య చేసినట్టు గుర్తించారు. దీంతో ఉదయం నుండి మదనపల్లిలో ఆందోళన నెలకొంది. ప్రజలు, ప్రతిపక్షపార్టీల నాయకులు రోడ్డుపై బైటాయించి ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలో హోంమంత్రి అనిత నేరుగా బాధిత కుంటుంబ సభ్యులకు ఫోన్ చేసి నచ్చజెప్పడంతో పోస్టుమార్టంకు అనుమతిచ్చారు. నిందితుడిని కఠినంగా శిక్షిస్తామని హామీ ఇచ్చారు.






