క‌ల‌లో దైవాన్ని దూషించింద‌ని ఈ మ‌హిళ‌ను అలా చేశారు?!

by Disha Web |
క‌ల‌లో దైవాన్ని దూషించింద‌ని ఈ మ‌హిళ‌ను అలా చేశారు?!
X

దిశ‌, వెబ్‌డెస్క్ః మ‌నుషుల్లో పాతుకుపోయిన గుడ్డిన‌మ్మ‌కాలు మాన‌వ‌త్వాన్ని కాల‌రాస్తున్నాయి. ముఖ్యంగా మ‌తపిచ్చిలో కొట్టుమిట్టాడుతున్న కొంద‌రు మ‌తం పేరుతో వారిలో క్రూర‌త్వాన్ని బ‌య‌ట‌పెడుతున్నారు. భార‌త దాయాది దేశం పాకిస్తాన్‌లో స‌రిగ్గా ఇలాంటి ఘోర‌మైన ఘ‌ట‌న ఒక‌టి చోటుచేసుకుంది. క‌ల‌లో ఓ యువ‌తి దైవాన్ని దూషించ‌ద‌ని ఆమెను ముగ్గురు యువ‌తులు అతి ఘోరంగా హ‌త్య చేశారు. పాకిస్తాన్‌లోని ఖైబర్ పఖ్తున్‌ఖ్వా ప్రాంతంలో చోటుచేసుకున్న ఈ ఘ‌ట‌న‌లో మ‌దర్సాలో త‌న‌తో పాటు టీచర్‌గా ప‌నిచేస్తున్న‌ మహిళను సహచరులు స‌హాయంతో దారుణంగా హత్య చేసింది ఓ యువ‌తి.

జిల్లా పోలీసు అధికారి (DPO) నజముల్ హస్నైన్ ఈ విష‌యాన్ని మీడియాకు వెల్ల‌డించారు. దీని ప్రకారం, జామియా ఇస్లామియా ఫలాహుల్ బినాత్ అనే సెమిన‌రి బ‌య‌ట‌, తెల్లవారుజాము స‌మ‌యంలో హ‌త్య చోటుచేసుకుంది. స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌నా స్థలానికి చేరుకున్నప్పుడు 21 ఏళ్ల యువ‌తి మెడకోసి, రక్తపు మడుగులో పడి ఉంది. బాధితురాలిపై పదునైన వస్తువులతో దాడి చేసిన‌ట్లు తెలిసింది. అయితే, ప్రాథ‌మిక ద‌ర్యాప్తులో భాగంగా ఈ కేసులో నిందుతులుగా ఉన్న‌ ఓ టీనేజర్‌తో సహా ముగ్గురు మహిళా మదర్సా టీచర్లను, నాల్గవ వ్య‌క్తిగా, 13 ఏళ్ల మ‌రో అనుమానితురాలిని పోలీసులు అరెస్టు చేశారు. ఎఫ్ఐఆర్‌ను బ‌ట్టి నిందితులు ముగ్గురూ సెమినరీ వెలుపల బాధితురాలిని అడ్డుకున్నారు. బాధితురాలు మత ప్ర‌వ‌క్త మౌలానా తారిఖ్ జమీల్ ఫాలోవ‌ర్ అని, దైవదూషణకు పాల్పడింద‌ని ఆరోపిస్తూ ఆమెతో మొద‌ట‌ వాగ్వాదానికి దిగారు. ఆ గొడ‌వ‌లో ఆమెను క‌త్తితో పొడిచి, ఆన‌క గొంతుకోసి హ‌త్య చేశారు. బాధితురాలు ప్రవక్తను దూషించిందని, 13 ఏళ్ల‌ వయసున్న తమ బంధువు ఒకరికి గత రాత్రి ప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం కలలో కనిపించారని, తమను ఆదేశించినట్లుగానే ఆమెను చంపేశామ‌ని నిందుతులైన‌ ముగ్గురు మహిళలు వెల్లడించారు. నిందితులు దక్షిణ వజీరిస్థాన్ జిల్లాకు చెందినవారనీ పోలీసులు తెలిపారు.

24 ఏళ్ల ఉమ్రా అమన్, 21 ఏళ్ల రజియా హన్ఫీ, 17 ఏళ్ల ఆయిషా నోమానీలను పోలీసులు అరెస్టు చేశారు. 13 ఏళ్ల బంధువును కూడా అరెస్టు చేశారు. కేసు నమోదు చేసుకొని తదుపరి విచారణ జరుపుతున్నారు. అయితే, వ్యక్తిగత కలహాలు లేదా మైనారిటీలను హింసించడం కోసం, ఒక్కోసారి ముస్లింలకు వ్యతిరేకంగా కూడా పాకిస్తాన్‌లో దైవదూషణ చట్టాలు తరచుగా ఉపయోగించుకుంటున్నార‌ని ఇప్ప‌టికి ప‌లుమార్లు మానవ హక్కుల సంస్థలు పేర్కొన్నాయి. పాకిస్తాన్‌లో, దైవదూషణ చట్టాలు, ప్రాసిక్యూషన్‌లకు వ్యతిరేకంగా మాట్లాడే ఎవరైనా వీధుల్లో కొట్టి, చంపబడతారు. పాకిస్తాన్‌లో, దైవదూషణ చట్టాల ఫలితంగా 1980ల చివరి నుండి 1990ల ప్రారంభంలోనే అరెస్టులు, మరణశిక్షలు ఉన్నాయి. ఈ చట్టాలు ఆమోదించబడ‌లేదు కాబ‌ట్టి కోర్టు లేదా ప్రభుత్వ డిక్రీ ద్వారా ఇంకా ఎవరికీ మరణశిక్ష విధించలేదు. ఇలాంటి కేసుల్లో దైవ దూష‌ణ చేస్తున్నారన్న అనుమానితులు కొంద‌రు ఖైదు చేయబడ్డారు, ఇంకొంద‌రు హ‌త్య‌కు గుర‌య్యారు.


Read latest Telugu news disha daily epaper

Next Story

Most Viewed