జూబ్లీహిల్స్‌లో లగ్జరీ కారు బీభత్సం.. పలువురికి తీవ్ర గాయాలు

by Kema Shiva Kumar |   (  Updated:2026-02-22 07:12:53  IST  )

హైదరాబాద్ జూబ్లీహిల్స్‌ రోడ్ నెంబర్ 45లో లగ్జరీ కారు బీభత్సం సృష్టించింది. బాలకృష్ణ నివాసం వద్ద అతివేగంతో మూడు వాహనాలపైకి దూసుకెళ్లడంతో పలువురికి గాయాలయ్యాయి.

జూబ్లీహిల్స్‌లో లగ్జరీ కారు బీభత్సం.. పలువురికి తీవ్ర గాయాలు
X

దిశ, వెబ్‌డెస్క్: లగ్జరీ కారు బీభత్సం సృష్టించిన ఘటన నగరంలోని జూబ్లీహిల్స్‌ (Jubilee Hills)లో ఇవాళ ఉదయం చోటుసుకుంది. వివరాల్లోకి వెళితే.. రోడ్ నెం.45లోని సినీ నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ (Nandamuri Bala Krishna) నివాసం వద్ద అతివేగంతో దూసుకొచ్చిన లగ్జరీ కారు డ్రైవర్ నియంత్రణ కోల్పోయి రోడ్డుపై వెళ్తున్న మూడు వాహనాలను బలంగా ఢీకొట్టింది. కారు వేగానికి వాహనాలన్నీ తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ ప్రమాదంలో వాహనాల్లో ప్రయాణిస్తున్న పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం తక్షణమే సమీపంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి అతివేగమే ప్రధాన కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. కారు నడుపుతున్న వ్యక్తి మద్యం సేవించి ఉన్నారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన జూబ్లీహిల్స్ పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు.

Next Story