దారుణం.. మైనర్ బాలికను కాల్చి చంపి.. తనను తాను కాల్చుకున్న ప్రియుడు

by Sujitha Rachapalli |

ఉత్తరప్రదేశ్ బులంద్‌షహర్‌లో దారుణం చోటు చేసుకుంది. దిబాయ్ పట్టణంలో హృదయవిదారక ఘటనతో స్థానికులు షాక్‌కు గురయ్యారు. ఇద్దరు ప్రేమికులు కళ్లముందే చనిపోవడంతో విషాద వాతావరణం నెలకొంది. వివరాల్లోకి వెళ్తే.. ముజఫ్ఫర్ నగర్ ఛప్పర్‌ పీఎస్ పరిధికి చెందిన

దారుణం.. మైనర్ బాలికను కాల్చి చంపి.. తనను తాను కాల్చుకున్న ప్రియుడు
X

దిశ, వెబ్ డెస్క్ : ఉత్తరప్రదేశ్ బులంద్‌షహర్‌లో దారుణం చోటు చేసుకుంది. దిబాయ్ పట్టణంలో హృదయవిదారక ఘటనతో స్థానికులు షాక్‌కు గురయ్యారు. ఇద్దరు ప్రేమికులు కళ్లముందే చనిపోవడంతో విషాద వాతావరణం నెలకొంది. వివరాల్లోకి వెళ్తే.. ముజఫ్ఫర్ నగర్ ఛప్పర్‌ పీఎస్ పరిధికి చెందిన మైనర్ బాలికను ఉత్తరాఖండ్ హరిద్వార్‌కు చెందిన 25ఏళ్ల యువకుడు బబ్లూ ప్రేమించాడు. కానీ అమ్మాయి ఫ్యామిలీ అడ్డుపడటంతో సెప్టెంబర్ 20న పారిపోయారు. యువకుడి మామ ప్రమోద్ సపోర్ట్‌తో దిబాయ్‌లోని ఓ ఇంట్లో అద్దెకు నివాసం ఉంటున్నారు. అయితే అమ్మాయి కుటుంబీకులు మైనర్ బాలికను కిడ్నాప్ చేశాడని కేసు పెట్టారు. దీంతో అబ్బాయి కోసం సెర్చ్ చేసిన పోలీసులు.. అద్దెకు ఉంటున్న ఇంటిని చుట్టుముట్టడంతో తప్పించుకునే ప్రయత్నం చేశారు. కానీ విఫలం కావడంతో ముందుగా అమ్మాయిని పిస్టల్‌తో కాల్చి చంపిన ప్రియుడు.. ఆ తర్వాత తనకు తాను కాల్చుకుని చనిపోయాడు. పోలీసులు ఇద్దరిని హాస్పిటల్‌కు తరలించగా.. అప్పటికే మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు.

Next Story