- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న ప్రేమ జంట
ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో విషాదం చోటు చేసుకుంది. రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు ఇద్దరు ప్రేమికులు. తమ పెళ్లికి పెద్దలు ఒప్పుకోలేదనే కారణంతో పిప్రైచ్ రైల్వే స్టేషన్ వద్ద చనిపోయారు.

దిశ, వెబ్ డెస్క్ : ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో విషాదం చోటు చేసుకుంది. రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు ఇద్దరు ప్రేమికులు. తమ పెళ్లికి పెద్దలు ఒప్పుకోలేదనే కారణంతో పిప్రైచ్ రైల్వే స్టేషన్ వద్ద చనిపోయారు. ఇద్దరూ ప్లాట్‌ఫాం మీద కూర్చుని చాలా సేపు మాట్లాడుకున్న ఇద్దరు.. ట్రైన్ దగ్గరకు వచ్చేసరికి చేతులు పట్టుకుని ఆకస్మికంగా ట్రాక్ పైకి దూకినట్లు తెలుస్తోంది. లోకో పైలట్ ఎమర్జెన్సీ బ్రేక్ వేసినా.. అప్పటికే ఇద్దరు రైలు కింద చిక్కుకుని చనిపోయారు.
సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు శవాలను స్వాధీనం చేసుకున్నారు. అక్కడికి చేరుకున్న అమ్మాయి తల్లి కన్నీరుతో కూలబడి పడిపోయింది. మరణించిన అబ్బాయిని 21 ఏళ్ల విశ్వకర్మ కుమార్‌గా గుర్తించారు. అతను పిప్రైచ్ నివాసి కాగా హైదరాబాద్‌లో పెయింటర్-పాలిషర్‌గా పని చేస్తూ దీపావళికి ఇంటికి వచ్చాడు. ఇక 18 ఏళ్ల అమ్మాయి సమీపంలోని బట్టల దుకాణంలో పని చేస్తున్నట్లు తెలుస్తోంది.ఆరు నెలల క్రితం కూడా వారు ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించగా.. జనాలు కాపాడినట్లు సమాచారం.






