ప్రియురాలికి పెళ్లి ఫిక్స్.. షాకింగ్ నిర్ణయం తీసుకున్న ప్రియుడు

by Sujitha Rachapalli |

ఉత్తరప్రదేశ్ చందౌలీ జిల్లాలో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. ప్రియురాలికి పెళ్లి ఫిక్స్ అయిందని తెలిసిన ప్రియుడు.. ఆమె ఇంటికి వెళ్లి.. తనను కాల్చాడు. ఆ తర్వాత తనకు తాను కాల్చుకుని చనిపోయాడు. మహమ్మద్‌పూర్ న్యూ కాలనీకి

ప్రియురాలికి పెళ్లి ఫిక్స్.. షాకింగ్ నిర్ణయం తీసుకున్న ప్రియుడు
X

దిశ, వెబ్ డెస్క్ : ఉత్తరప్రదేశ్ చందౌలీ జిల్లాలో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. ప్రియురాలికి పెళ్లి ఫిక్స్ అయిందని తెలిసిన ప్రియుడు.. ఆమె ఇంటికి వెళ్లి.. తనను కాల్చాడు. ఆ తర్వాత తనకు తాను కాల్చుకుని చనిపోయాడు. మహమ్మద్‌పూర్ న్యూ కాలనీకి చెందిన సంజయ్(25) పండ్ల వ్యాపారి. కాగా సబియా బానో(22)తో కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్నాడు. కానీ ఆమె కుటుంబం మరొకరితో పెళ్లి ఫిక్స్ చేయడంతో ఆందోళనకు గురయ్యాడు.

రామ్ నగర్‌లో ఉన్న సబియా ఇంట్లోకి ప్రవేశించిన అతను.. ఆమెపై పిస్టల్‌తో కాల్పులు జరిపాడు. ఛాతీ, కడుపులో ఆమెకు గాయాలు కాగా ఆ తర్వాత అతను కూడా తనకు తాను కాల్చుకోవడంతో చనిపోయాడు. సబియాను ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతుంది. కానీ కండిషన్ క్రిటికల్‌గానే ఉన్నట్లు తెలిపారు వైద్యులు. కాగా కేసు నమోదు చేసిన పోలీసులు ముందుగా ఘటనాస్థలం నుంచి పిస్టల్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయంలో ఇతరుల ప్రమేయం ఉందా లేదా అన్న విషయంపై దర్యాప్తు చేస్తున్నారు.

Next Story