ప్రేమ విఫ‌ల‌మై యువ‌కుడు ఆత్మ‌హ‌త్య

by Nallavelli.Anjaneyulu |

ప్రేమ విఫలమై ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘ‌ట‌న అత్తాపూర్ పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో చోటు చేసుకుంది.

ప్రేమ విఫ‌ల‌మై యువ‌కుడు ఆత్మ‌హ‌త్య
X

దిశ, రాజేంద్రనగర్ : ప్రేమ విఫలమై ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘ‌ట‌న అత్తాపూర్ పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో చోటు చేసుకుంది. ఎస్ఐ వెంక‌టేష్ తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. అత్తాపూర్ సాయి నగర్ కు చెందిన యాకిరెడ్డి కుమారుడు ఆదిత్యరెడ్డి(29) ప్రైవేటు ఉద్యోగి. శంషాబాద్ లో నివాసం ఉంటున్న ఓ యువతిని ప్రేమించాడు. వీరిద్ద‌రూ పెళ్లి చేసుకుందామని అనుకున్నారు. అయితే ప్రస్తుతం ఆ యువతి ఆదిత్యరెడ్డి తో పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడటం లేదు. మనస్థాపానికి గురైన ఆదిత్య రెడ్డి ఆదివారం సాయంత్రం ఇంటికి వచ్చాడు. పైన గదిలో పడుకుంటానని, సోమవారం పరీక్ష ఉందని రాత్రి 12:30 గంటలకు నిద్రలేపాలని తండ్రికి చెప్పాడు. ఆదివారం రాత్రి 12:30 గంటలకు తండ్రి యాకిరెడ్డి కొడుకు ఆదిత్యరెడ్డిని ఫోన్ చేసి లేపడానికి ప్రయత్నించగా.. అతను ఫోన్ తీయలేదు. పైకి వెళ్లి చూడగా తలపు లోపలినుంచి పెట్టుకుని ఉన్నాడు. క్రిందకు వచ్చి భార్యకు చెప్పి సుత్తితో తలుపులు పగులగొట్టి చూడగా ఆదిత్యరెడ్డి లుంగీతో ఫ్యాన్ కు ఉరి వేసుకుని కనిపించాడు. సమీపంలోని ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మరణించినట్లు డాక్టర్లు ధృవీకరించారు. యాకిరెడ్డి ఫిర్యాదు మేరకు అత్తాపూర్ ఎస్ఐ వెంకటేశ్ కేసు న‌మోదు చేసుకొని దర్యాప్తు చేప‌డుతున్న‌ట్టు తెలిపారు.

Next Story