ఇన్‌స్టా లవ్.. ఉరేసుకుని ప్రేమజంట ఆత్మహత్య

by Naga Rani Yarlagadda |

సోషల్ మీడియా ద్వారా ఏర్పడిన పరిచయంతో ప్రేమజంటగా మారిన ఇద్దరు.. చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు.

ఇన్‌స్టా లవ్.. ఉరేసుకుని ప్రేమజంట ఆత్మహత్య
X

దిశ, వెబ్‌డెస్క్: సోషల్ మీడియా ద్వారా ఇద్దరి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. కలిసి జీవించే అవకాశం లేకపోవడంతో ఇద్దరూ పురుగుల మందు తాగి, చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన నెల్లూరు జిల్లా రాపూరుఘాట్ అడవుల్లో వెలుగుచూసింది. స్థానికుల సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాలను కిందికి దించి పోస్టుమార్టంకు పంపారు. మృతులను ముత్తకూరుకు చెందిన ఆలపాక ప్రసన్న కుమార్(25), చిట్టమూరుకు చెందిన వివాహిత (24)గా గుర్తించారు. ఆమెకు ఆల్రెడీ పెళ్లి కావడంతో.. వారి ప్రేమను ఎవరూ అంగీకరించరని, కలిసి జీవించే ఛాన్స్ లేదని భావించి ఉరివేసుకున్నట్లుగా పోలీసులు భావిస్తున్నారు. మహిళకు పెళ్లై ఇద్దరు పిల్లులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉందని, ప్రస్తుతం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు.

Next Story