- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
లారీ బ్రేకులు ఫెయిల్.. స్పాట్‌లోనే ముగ్గురు మహిళలు దుర్మరణం
రోడ్డు ప్రమాదం (Road Accident)లో ముగ్గురు స్పాట్‌లోనే ప్రాణాలు కోల్పోయిన హృదయ విదారక ఘటన కర్నూలు (Kurnool) జిల్లాలో ఇవాళ మధ్యాహ్నం చోటుచేసుకుంది.

X
దిశ, వెబ్‌డెస్క్: రోడ్డు ప్రమాదం (Road Accident)లో ముగ్గురు స్పాట్‌లోనే ప్రాణాలు కోల్పోయిన హృదయ విదారక ఘటన కర్నూలు (Kurnool) జిల్లాలో ఇవాళ మధ్యాహ్నం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. పత్తికొండ (Pattikonda) సమీపంలో ప్రయాణికులతో ఆటో వెళ్తుంది. ఈ క్రమంలోనే ఎదురుగా వస్తున్న లారీ బ్రేకులు ఫెయిల్ అవడంతో డ్రైవర్ నియంత్రణ కోల్పోయి ఆటోను బలంగా ఢీకొట్టాడు. ఈ దుర్ఘటనలో ఆటో నుజ్జునుజ్జు కాగా.. ముగ్గురు మహిళలు తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు ముక్కెళ్ల గ్రామానికి చెందిన తల్లీ, ఇద్దరు కూతుళ్లుగా గుర్తించారు. మరో బాలుడి పరిస్థితి విషమంగా ఉండటంతో హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Next Story






