- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఫామ్‌హౌస్‌లో లిక్కర్, డ్రగ్స్ పార్టీ.. పోలీసుల అదుపులో 51 మంది ఆఫ్రికన్లు
హైదరాబాద్ నగర శివారులోని ఓ ఫామ్‌హౌస్‌లో గుట్టుచప్పుడు కాకుండా లిక్కర్, డ్రగ్స్ పార్టీ జరుగుతుండగా పోలీసులు ఆకస్మిక దాడుల నిర్వహించారు.

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ నగర శివారులోని ఓ ఫామ్‌హౌస్‌లో గుట్టుచప్పుడు కాకుండా లిక్కర్, డ్రగ్స్ పార్టీ జరుగుతుండగా పోలీసులు ఆకస్మిక దాడులు చేశారు. వివరాల్లోకి వెళితే.. బాకారం గ్రామ పరిధిలోని SKM ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్, లిక్కర్ పార్టీ జరుగుతోందని ఎక్సైజ్ పోలీసులకు విశ్వసనీయ సమాచారం అందింది. దీంతో వారు నార్కోటిక్ బ్యూరో అధికారులతో కలిసి హుటాహుటిన ఫామ్‌హౌస్‌పై రెయిడ్ చేశారు. ఈ మేరకు పార్టీలో పాల్గొన్న మొత్తం 51 మంది ఆఫ్రికన్లను అదపులోకి తీసుకున్నారు. అయితే, అందరికీ డగ్స్ పరీక్షలు నిర్వహించగా.. అందులో ముగ్గురికి పాజిటివ్ వచ్చింది. అనంతరం స్పాట్‌కు ఇమ్మిగ్రేషన్ అధికారులు కూడా చేరుకుని వారి వీసాలను పరిశీలిస్తున్నారు. విదేశీయులంతా పార్టీకి పర్మీషన్ తీసుకున్నారా.. లేదా అని ఆరా తీస్తున్నారు. అసలు పార్టీలోకి విదేశీ మద్యం, డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చాయనే విషయంపై ఎక్సైజ్ పోలీసులు ఫోకస్ పెట్టారు. దాదాపు 100 మంది పోలీసు బందోబస్తుతో బాకారం SKM ఫామ్‌హౌస్‌లో సోదాలు కొనసాగుతున్నాయి.






