ఆ వ్యసనాన్ని వదులుకోలేని లైన్‌మన్.. ఒక్క సింగిల్ నంబరైనా తగులుతుందని..

by Bhoopathi Nagaiah |

ఎందరో ఎన్నో రకాల వ్యసనాలకు బానిసలు అవుతున్నారు. వాటికి దాసోహమై అప్పులు పాలై ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.

ఆ వ్యసనాన్ని వదులుకోలేని లైన్‌మన్.. ఒక్క సింగిల్ నంబరైనా తగులుతుందని..
X

దిశ, సూళ్లూరుపేట : ఎందరో ఎన్నో రకాల వ్యసనాలకు బానిసలు అవుతున్నారు. వాటికి దాసోహమై అప్పులు పాలై ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇలాంటి సంఘటనే తిరుపతి జిల్లా, ఓజిలి మండలంలోని కురుగొండ గ్రామంలో మంగళవారం జరిగింది. వివరాల మేరకు మురళీకృష్ణ కోరుకొండ సబ్ స్టేషన్‌లో లైన్‌మన్ గా పనిచేస్తున్నాడు. అతనికి సింగిల్ నెంబర్ లాటరీ వ్యసనం అంటుకుంది. దీంతో సింగిల్ నంబర్ లాటరీ జూదానికి బానిస అయ్యాడు. లక్కీ నంబర్ వస్తే లక్షలు గడించవచ్చని లక్షల్లో అప్పులు చేసి ఏమి చేయాలో దిక్కుతోచని స్థితిలో ఫ్యానుకు ఊరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

నాయుడుపేటలో సింగిల్ నెంబర్ లాటరీ(Single number lottery) రాకెట్ గుట్టు చప్పుడు కాకుండా కొనసాగుతోంది, ఈ లాటరీ వ్యసనానికి బానిసై ఆత్మహత్యకు పాల్పడిన మురళి కృష్ణ కుటుంబం దిక్కుతోచని స్థితిలో ఉంది. నాయుడుపేటలో జరుగుతున్న లాటరీ వ్యవహారంలో విద్యార్థులు, ఉద్యోగులు కూడా సింగిల్ నెంబర్ లాటరీ కడుతున్నట్లు సమాచారం. ఏది ఏమైనా ఇలాంటి అనధికారిక వ్యసనాలను అలవాటు చేస్తున్న బాధ్యులైన వారిపై చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.

Next Story