- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కాలం చెల్లిన సిద్ధాంతాలను వీడండి.. మావోయిస్టులకు వ్యతిరేకంగా వెలిసిన పోస్టర్లు
మావోయిస్టుల (Maoists)కు వ్యతిరేకంగా పోస్టర్లు వెలిసిన ఘటన జయశంకర్ భూపాలపల్లి (Jayashankar Bhupalapally) జిల్లాలో కలకలం రేపుతోంది.

దిశ, వెబ్‌డెస్క్: మావోయిస్టుల (Maoists)కు వ్యతిరేకంగా పోస్టర్లు వెలిసిన ఘటన జయశంకర్ భూపాలపల్లి (Jayashankar Bhupalapally) జిల్లాలో కలకలం రేపుతోంది. ముకునూరు, నీలంపల్లి, బూరుగూడెంతో పాటు సర్వాయిపేట గ్రామాల్లో మావోయిస్టులకు వ్యతిరేకంగా తెల్లవారుజామున వాల్ పోస్టర్లు దర్శనమిచ్చాయి. మావోయిస్టు అగ్ర నేతలు కాలం చెల్లిన సిద్ధాంతాలను పూర్తిగా విడనాడి జనజీవన స్రవంతిలో కలవాలని ఆ పోస్టర్ల సారాంశం. మేధస్సును ప్రజల అభివృద్ధికి ఉపయోగించాలంటూ మావోయిస్టు ఆత్మ పరిరక్షణ, ప్రజా ఫ్రంట్ తరఫున పోస్టర్లు వెలిశాయి. అదేవిధంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండల పరిధిలో మావోయిస్టుల పోస్టర్లు కలకలం సృష్టిస్తున్నాయి. మావోయిస్టు అమరవీరుల స్తూపాలు నిర్మించి పెద్ద ఎత్తున సంస్మరణ సభలు నిర్వహించాలని ఆర్.కొత్తగూడెం, దానవయిపేటలో పోస్టర్లు, బ్యానర్లు వెలిశాయి. మరోవైపు నేటి నుంచి మావోయిస్టు పార్టీ వారోత్సవాల నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. పాడేరు, భద్రాద్రి, ములుగు ఏజెన్సీ ప్రాంతాల్లో హై అలర్ట్ ప్రకటించారు. అదేవిధంగా చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి వాహనాలను తనిఖీ చేస్తున్నారు.






