స్నేహితుల రూమ్‌కు వెళ్లిన అడ్వకేట్.. ఉరేసుకుని ఆత్మహత్య

by Taduka Kalyani |   (  Updated:2025-07-01 16:15:48  IST  )

ఒక వ్యక్తి సూసైడ్ చేసుకున్న సంఘటన ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే మహబూబాబాద్ జిల్లా, తొర్రూరు గ్రామానికి చెందిన లక్షాధికారి కి నలుగురు సంతానం ఇద్దరు కూతుళ్లు, ఇద్దరు కుమారులు కలరు.

స్నేహితుల రూమ్‌కు వెళ్లిన అడ్వకేట్.. ఉరేసుకుని ఆత్మహత్య
X

దిశ,ఉప్పల్: ఒక వ్యక్తి సూసైడ్ చేసుకున్న సంఘటన ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే మహబూబాబాద్ జిల్లా, తొర్రూరు గ్రామానికి చెందిన లక్షాధికారి కి నలుగురు సంతానం ఇద్దరు కూతుళ్లు, ఇద్దరు కుమారులు కలరు. చిన్న కుమారుడు కల్లూరి సాయినాథ్ (30) అడ్వకేట్ గా పనిచేస్తున్నాడు. ఉప్పల్ సూర్య నగర్ కాలనీలో ఒక్కడే రూమ్ అద్దెకు తీసుకొని ఉంటున్నాడు. మంగళవారం ఉదయం విజయపురి కాలనీలో తమ మిత్రుల అద్దెకు ఉంటున్న రూం కి వచ్చాడు. ఆ సమయంలో మిత్రులు ఉద్యోగం రీత్యా ఆఫీస్ కు వెళ్లిపోయారు. రాత్రి 7 గంటలకు ఆఫీస్ నుంచి రూమ్ కి వచ్చి చూసేసరికి లోపటి నుంచి తలుపులు లాక్ చేసుకున్నాడు. ఎంతకు తలుపులు తీయకపోవడంతో వెంటిలేటర్ నుంచి చూసేసరికి రూమ్ లో తాడుతో సీలింగ్ ఫ్యాన్ కి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. వెంటనే డయల్ 100 కి ఫోన్ చేశారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్యకు కారణాలు తెలియరాలేదు.

Next Story