హైదరాబాద్‌లో న్యాయవాది దారుణ హత్య

by Gantepaka Srikanth |

హైదరాబాద్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. అత్తాపూర్‌లో కొందరు గుర్తుతెలియని వ్యక్తులు నడిరోడ్డుపై అడ్వకేట్ మహమ్మద్ ఖదీర్‌పై అత్యంత కిరాతకంగా కత్తులతో దాడి చేశారు.

హైదరాబాద్‌లో న్యాయవాది దారుణ హత్య
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌(Hyderabad)లో దారుణ ఘటన చోటుచేసుకుంది. అత్తాపూర్‌లో కొందరు గుర్తుతెలియని వ్యక్తులు నడిరోడ్డుపై అడ్వకేట్ మహమ్మద్ ఖదీర్‌(Lawyer brutally murdered)పై అత్యంత కిరాతకంగా కత్తులతో దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన ఖదీర్.. ఆసుపత్రికి తరలిస్తుండగా మృతిచెందారు. స్థానికుల సమాచారంతో విషయం తెలిసిన పోలీసులు హుటాహుటిన స్పాట్‌కు వచ్చారు. కేసు నమోదు చేసుకుని నిందితుల కోసం గాలిస్తున్నారు. కుటుంబ విభేదాలతో బంధువులే చంచినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. హత్యకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా, ఇటీవలే రంగారెడ్డి జిల్లాలోని మొయినాబాద్‌ మండలం కేతిరెడ్డిపల్లిలో న్యాయవాది స్వప్నను దారుణంగా హత్య చేసిన విషయం తెలిసిందే. ఆస్తి కోసం సొంత కుటుంబసభ్యులే స్వప్నను అత్యంత అమానుషంగా చంపేశారు. ఈ ఘటనను ఇంకా మరువకముందే నగరంలో మరో అడ్వొకేట్‌ను హత్య చేయడం కలకలం రేపుతోంది. దీనిపై న్యాయవాద సంఘాలు ఏ విధంగా స్పందిస్తాయో అని ఆసక్తి నెలకొంది.

Next Story