- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పంజాబ్‌లో యానిమల్ సినిమా తరహా ఘటన.. లా విద్యార్థి గన్‌తో హల్ చల్
పంజాబ్‌లో యానిమల్ సినిమా తరహా ఘటన జరిగింది. సినిమాలో హీరో తన సోదరిని ఏడిపించారని కాలేజీలోకి వెళ్లి కాల్పులు జరుపుతాడు. పంజాబ్ లోనూ ఓ విద్యార్థి అలానే చేశాడు.

దిశ, వెబ్ డెస్క్: పంజాబ్‌లో యానిమల్ సినిమా తరహా ఘటన జరిగింది. సినిమాలో హీరో తన సోదరిని ఏడిపించారని కాలేజీలోకి వెళ్లి కాల్పులు జరుపుతాడు. పంజాబ్ లోనూ ఓ విద్యార్థి అలానే చేశాడు. అయితే ఇక్కడ విద్యార్థి ఏకంగా తోటి విద్యార్థినిని హత్య చేయడంతో పాటు తనను తాను కాల్చుకున్నాడు. ఈ ఘటన తర్న్ తరన్ జిల్లాలో చోటు చేసుకుంది. ఉస్మాలోని మై భాగో లా కాలేజీలో ప్రిన్స్ రాజ్ అనే విద్యార్థి తన తోటి విద్యార్థినిని సందీప కౌర్‌ను తరగతి గదిలో అందరి ముందే గన్ తో కాల్చేశాడు. దీనికి సంబంధించిన దృష్యాలు సీసీ టీవీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి.
వీడియోలో ప్రిన్స్ రాజ్ బ్యాగుతో తరగతి గదిలోకి వచ్చినట్టు కనిపిస్తోంది.ఆ సమయంలో కౌర్ తన స్నేహితురాలితో మాట్లాడుతూ ఉండగా ప్రిన్స్ రాజ్ ఆమెను తుపాకీతో కాల్చాడు. అక్కడే కుప్పకూలిన యువతి మరణించగా, అనంతరం ప్రిన్స్ రాజ్ సైతం కాల్చుకున్నాడు. ప్రస్తుతం నిందితుడి పరిస్థితి విషమంగా ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. అయితే నిందితుడు ఎందుకు దాడికి పాల్పడ్డాడో ఇంకా తెలియలేదు. తన కూతురును చంపినవాడిని కఠినంగా శిక్షించాలని యువతి తల్లి డిమాండ్ చేస్తోంది. అసలు కాలేజీలోకి తుపాకీని ఎలా అనుమతించారని ప్రశ్నిస్తోంది.






