షాకింగ్ ఘటన.. పాఠశాల సమీపంలో భారీగా పేలుడు పదార్థాలు

by Gantepaka Srikanth |

షాకింగ్ ఘటన.. పాఠశాల సమీపంలో భారీగా పేలుడు పదార్థాలు

షాకింగ్ ఘటన.. పాఠశాల సమీపంలో భారీగా పేలుడు పదార్థాలు
X

దిశ, వెబ్‌డెస్క్: పాఠశాల పరిసర ప్రాంతాల్లో పేలుడు పదార్థాలు లభ్యమైన ఘటన దేశ వ్యాప్తంగా కలకలం రేపింది. పాఠశాల ప్రిన్సిపాల్ మొదటగా పొదల్లో అనుమానాస్పద ప్యాకెట్లను గమనించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన రెండు పోలీసు బృందాలు అక్కడికి చేరుకుని ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. ఉధమ్ సింగ్ నగర్, నైనిటాల్ జిల్లాల నుంచి బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్‌లను కూడా రప్పించారు. డాగ్ స్క్వాడ్ జరిపిన సోదాల్లో 20 కేజీల పేలుడు పదార్థాలు లభ్యమయ్యాయి. ఉత్తరాఖండ్‌లోని అల్మోరా జిల్లా సుల్త్ ప్రాంతంలోని దబారా గ్రామంలో ఉన్న ప్రభుత్వ హయ్యర్ సెకండరీ స్కూల్ పక్కన పొదల్లో ఈ ఘటన చోటుచరేసుకుంది. సాధారణంగా నిర్మాణాలు, మైనింగ్ పనుల్లో రాళ్లను పేల్చేందుకు ఈ జిలెటిన్ స్టిక్స్‌ను ఉపయోగిస్తారు. అయితే, ఇంత భారీ మొత్తంలో వీటిని గ్రామానికి ఎందుకు తీసుకొచ్చారనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

Next Story