బంగారు గనిలో ఘోర ప్రమాదం.. 10 మంది దుర్మరణం

by Yella Dhawani Reddy |   (  Updated:2025-01-31 03:56:31  IST  )

మాలిలో ఘోర ప్రమాదం సంభవించింది.

బంగారు గనిలో ఘోర ప్రమాదం.. 10 మంది దుర్మరణం
X

దిశ, వెబ్ డెస్క్: మాలిలో ఘోర ప్రమాదం సంభవించింది. కౌలికోరో ప్రాంతంలో బంగారు గని కూలి 10 మంది మృతి చెందారు. పలువురి ఆచూకీ గల్లత్తైంది. మృతుల్లో ఎక్కువ మంది మహిళలే ఉన్నట్లు సమాచారం. బంగారం వెతుకులాటకు వెళ్లి వారంతా శిథిలాల కింద చిక్కుకుపోయారని కౌలికోరో గవర్నర్‌ కల్నల్‌ లామైన్‌ కపోరీ సనొగో తెలిపారు. ఒక్కసారిగా బురద నీరు ప్రవేశించి మహిళలను చుట్టుముట్టిందని వెల్లడించారు. ఈ ఘటనలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని, గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. గని కూలడానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.

కాగా, ఆఫ్రికాలోని మూడవ అతి పెద్ద బంగారు ఉత్పత్తి దేశమైన మాలిలో ఇలాంటి ప్రమాదాలు సర్వసాధారణంగా మారిపోయాయి. గతేడాది సైతం ఇదే ప్రాంతంలోని కంగబా జిల్లాలో బంగారు గని కుప్పకూలింది. ఈ ఘటనలో 70 మందికి పైగా మృత్యువాత పడ్డారు. మారుమూల ప్రాంతాలలో భద్రతా చర్యలను పాటించకుండా, అక్రమంగా మైనింగ్‌కు పాల్పడుతుండడం ఈ ప్రమాదాలకు ప్రధాన కారణంగా తెలుస్తోంది.

ప్రజలు భద్రతా నిబంధనలకు అనుగుణంగా నడుచుకోవాలని అక్కడి అధికారులు తరచూ సూచిస్తున్నా.. వారు భద్రతా చర్యలను విస్మరిస్తున్నారని చెప్పారు. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా మైనింగ్ రంగంలో కొన్ని చర్యలు తీసుకురావాల్సి ఉందని వివరించారు. ఈ ప్రమాదంపై గనుల మంత్రిత్వ శాఖ తీవ్ర విచారం వ్యక్తం చేసింది.

Next Story