తెలంగాణ సరిహద్దులో పేలిన ల్యాండ్‌మైన్.. ముగ్గురు పోలీసులు మృతి

by Kema Shiva Kumar |   (  Updated:2025-05-08 06:17:08  IST  )

ల్యాండ్‌మైన్ పేలి ముగ్గురు పోలీసులు స్పాట్‌లోనే ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన తెలంగాణ సరిహద్దులో ఇవాళ తెల్లవారుజామున చోటుచేసుకుంది.

తెలంగాణ సరిహద్దులో పేలిన ల్యాండ్‌మైన్.. ముగ్గురు పోలీసులు మృతి
X

దిశ, వెబ్‌డెస్క్/ములుగు: ల్యాండ్‌మైన్ (Landmine) పేలి ముగ్గురు గ్రేహౌండ్స్ జవాన్లు స్పాట్‌లోనే ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన ఛత్తీస్‌గఢ్ (Chhattisgarh)-తెలంగాణ (Telangana) సరిహద్దులో ఇవాళ ఉదయం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ములుగు (Mulugu) జిల్లా వెంకటాపురం మండల పరిధిలోని వీరభద్రపురం, తడపాల గుట్టలపై దట్టమైన అడవుల్లో మావోయిస్టులు సంచారిస్తున్నారనే సమాచారం మేరకు పోలీసులు ఆ ప్రాంతంలో ఇవాళ తెల్లవారుజాము నుంచే కూంబింగ్‌ ఆపరేషన్ చేపట్టారు. ఈ క్రమంలోనే వారికి మావోయిస్టులు ఎదరుపడగా.. ఇరువర్గాల మధ్య తీవ్ర స్థాయిలో ఎదరుకాల్పులు జరిగాయి. పక్కా ప్లాన్ ప్రకారం గ్రేహౌండ్స్ జవాన్లను ట్రాప్ చేసిన మావోయిస్టులు వారు ల్యాండ్‌మైన్ (Landmine) ఉన్న స్పాట్‌కు రాగానే ఒక్కసారిగా పేల్చేశారు. ఈ భారీ పేలుడులో కూబింగ్‌కు వచ్చిన ముగ్గురు గ్రేహౌండ్స్ జవాన్లు తీవ్ర గాయాలతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. అయితే, జవాన్ల మృతిపై ఇప్పటి వరకు ములుగు ఎస్పీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఈ వార్తకు సంబంధించి మరింత సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది.

Next Story