- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భూ తగాదా చిచ్చుగా మారి.. బంధువునే హత్య చేసిన వైనం
జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలో భూ తగాదా ఓ వ్యక్తి ప్రాణం తీయడంతో ఉద్రిక్తత నెలకొంది.

దిశ, మెట్‌పల్లి/ఇబ్రహీంపట్నం: జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలో భూ తగాదా ఓ వ్యక్తి ప్రాణం తీయడంతో ఉద్రిక్తత నెలకొంది. మూలరాంపూర్ గ్రామానికి చెందిన గూడ గంగాధర్ (43) తన పెద్దనాన్న కొడుకు గూడ రవి (36)తో గత రెండు సంవత్సరాలుగా 12 గుంటల భూమిపై వివాదం కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.
ఈ నెల 9న గంగాధర్, రవి వ్యవసాయ భూమి సరిహద్దును చెక్కుతుండగా రవి వచ్చి ప్రశ్నించాడు. ఈ చిన్నతరహా వాగ్వాదం ముదిరి గంగాధర్ తన చేతిలో ఉన్న పారతో రవి తల, ముఖంపై దాడి చేశాడు. దీంతో.. తీవ్రంగా గాయపడిన రవిని కుటుంబ సభ్యులు మెట్‌పల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, అక్కడి నుంచి నిజామాబాద్‌లోని ప్రైవేట్ ఆసుపత్రికి చేర్చారు. అయితే చికిత్స పొందుతూ సోమవారం రాత్రి రవి మృతి చెందాడు.
మృతుడి భార్య గూడ రజిత ఫిర్యాదు మేరకు పోలీసులు హత్యాయత్నం కేసును హత్యగా మార్చి దర్యాప్తు చేస్తున్నారు. ఘటన స్థలాన్ని మెట్‌పల్లి సీఐ అనిల్ కుమార్ పరిశీలించారు.






