- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఢిల్లీలో లేడీ డాన్ నేహా అరెస్ట్
మోస్ట్ వాంటెడ్ లేడీ గ్యాంగ్‌స్టర్ కుసుమ అలియాస్ నేహా అరెస్ట్ అయ్యారు. గురువారం ఆమెను ఢిల్లీ స్పెషల్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

దిశ, వెబ్‌డెస్క్: మోస్ట్ వాంటెడ్ లేడీ గ్యాంగ్‌స్టర్ కుసుమ అలియాస్ నేహా(Lady don Neha) అరెస్ట్ అయ్యారు. గురువారం ఆమెను ఢిల్లీ స్పెషల్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌లో పనిచేస్తున్నట్లు గుర్తించారు. దేశ రాజధాని ఢిల్లీ వేదికగా బ్యూటీ పార్లర్ ముసుగులో డ్రగ్స్ వ్యాపారం చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. గ్యాంగ్‌స్టర్ బాబీ కబూతర్‌కు నేహా గర్ల్‌ఫ్రెండ్ అని పోలీసు వర్గాలు తెలిపాయి. సిండికేట్ కోసం అక్రమ ఆయుధాలను సరఫరా చేసే వ్యక్తిగా బాబీ కబూతర్‌పై ఆరోపణలు ఉన్నాయి. నేపాల్-భారత సరిహద్దు సమీపంలో ఇటీవల అరెస్ట్ అయిన సలీం పిస్టల్ అనే వ్యక్తి వద్ద నుంచి బాబీ కబూతర్ ఆయుధాలను సేకరించాడని దర్యాప్తు అధికారులు తెలిపారు. సలీం పిస్టల్‌ను పాకిస్తాన్ ఐఎస్ఐతో సంబంధాలున్న ప్రధాన అక్రమ ఆయుధ వ్యాపారిగా ఏజెన్సీలు అభివర్ణించాయి. సలీంతో పాటు నేహా కూడా అనేక దారుణాలకు పాల్పడిందని పేర్కొన్నారు. ఇలా నేరాల నెట్‌వర్క్‌లతో సంబంధం ఉన్న మహిళను అరెస్టు చేయడం ఇది మొదటిసారేం కాదని పోలీసులు తెలిపారు. గతంలో, ఛండీగఢ్‌లో దీపా మరియు హషీం బాబా గ్యాంగ్‌తో సంబంధం ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న జోయా ఖాన్ అనే మహిళలను కూడా అదుపులోకి తీసుకున్నారు. జోయా ప్రస్తుతం జైలులో ఉన్నారు.






