- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వీడిన కర్నూలు మర్డర్ మిస్టర్...వెలుగులోకి షాకింగ్ నిజాలు
కర్నూలులో గద్వాలకు చెందిన సర్వేయర్ గంట తేజేశ్వర్ 32ను దారుణంగా హత్య చేసిన సంగతి తెలిసిందే. పెళ్లై నెల రోజులు గడవకముందే తేజేశ్వర్ హత్య కలకలం రేపుతోంది.

దిశ, వెబ్ డెస్క్: కర్నూలులో గద్వాలకు చెందిన సర్వేయర్ గంట తేజేశ్వర్ 32ను దారుణంగా హత్య చేసిన సంగతి తెలిసిందే. పెళ్లై నెల రోజులు గడవకముందే తేజేశ్వర్ హత్య కలకలం రేపుతోంది. అయితే కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. తేజేశ్వర్ ను బ్యాంకు మేనేజర్ తిరుమల రావు హత్య చేసినట్టు తెలుస్తోంది. తిరుమల రావు మేనేజేర్ గా పనిచేస్తున్న బ్యాంకులో ఓ మహిళతో అతడికి అక్రమ సంబంధం ఏర్పడింది. కాగా ఆమె కూతురునే తేజేశ్వర్ ప్రేమ పెళ్లి చేసుకున్నాడు.
కానీ ఈ వివాహం తిరుమల రావుకు, యువతి తల్లికి ఇష్టం లేకుండా జరిగింది. ఈ నేపథ్యంలో తిరుమల రావు తేజేశ్వర్‌ను హత్య చేయాలని పథకం రచించాడు. తేజేశ్వర్ సర్వేయర్ కావడంతో ఈ నెల 17న వ్యవసాయ భూమి సర్వే పేరుతో కొంతమంది అతడిని కారులో బయటకు తీసుకువెళ్లారు. తేజేశ్వర్ ఇంటికి రాకపోవడంతో అతడి సోదరుడు గద్వాల టౌన్ పోలీస్ స్టేషన్‌లో పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
దీంతో గద్వాల ఎస్పీ ప్రత్యేక బృందంతో దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో కర్నూలులోని పాణ్యం సమీపంలోని పిన్నాపురం చెరువు దగ్గరలో తేజేశ్వర్ మృతదేహాన్ని సెల్ ఫోన్ లొకేషన్ ఆధారంగా గుర్తించారు. కేసులో బ్యాంకు మేనేజర్ తిరుమల రావు, మృతుడు ప్రేమ వివాహం చేసుకున్న యువతి తల్లితో పాటు మరికొందరి హస్తం కూడా ఉండొచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు పెళ్లికి ముందే యువతికి ఎఫైర్స్ ఉన్నాయని ఆమె హస్తం కూడా ఉందని మృతుడి బంధువులు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది.






