- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రేమ పెళ్లి.. అనుమానంతో భార్యను హత్య చేసిన వ్యక్తికి కఠిన శిక్ష
by Naga Rani Yarlagadda |
ప్రేమించి పెళ్లాడిన వ్యక్తే ఆమె పాలిట కాలయముడయ్యాడు.

X
దిశ, వెబ్‌డెస్క్: ప్రేమించి పెళ్లాడిన వ్యక్తే ఆమె పాలిట కాలయముడయ్యాడు. భార్యపై అనుమానంతో ఆమెను కడతేర్చాడు. 2018లో జరిగిన ఈ హత్యపై విచారణ పూర్తి చేసిన కర్నూలు జిల్లా సెషన్స్ కోర్టు.. నిందితుడికి కఠిన శిక్ష విధించింది. శ్రీనివాసులు అనే వ్యక్తి 2007లో లక్ష్మీదేవిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరు కర్నూల్ ఆర్టీస బస్టాండ్ సమీపంలోని శివప్ప నగర్లో కాపురం పెట్టారు. పెళ్లయిన పదేళ్ల తర్వాత భార్యపై అనుమానంతో ఆమెను హతమార్చాడు. అప్పటి ఇన్ స్పెక్టర్ మహేశ్వర్ రెడ్డి ఈ ఘటనపై కేసు నమోదు చేసి ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. ఏడేళ్ల తర్వాత నిందితుడికి జిల్లా సెషన్స్ కోర్టు జడ్జి రూ.10 వేలు జరిమానా, జీవిత ఖైదు శిక్ష విధించారు.
Next Story






