కర్నూలు బస్సు ప్రమాద ఘటన.. డ్రైవర్‌ లక్ష్మయ్యకు రిమాండ్‌

by Kema Shiva Kumar |

కర్నూలు బస్సు ప్రమాద ఘటన కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.

కర్నూలు బస్సు ప్రమాద ఘటన.. డ్రైవర్‌ లక్ష్మయ్యకు రిమాండ్‌
X

దిశ, వెబ్‌డెస్క్: కర్నూలు బస్సు ప్రమాద ఘటన కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. దుర్ఘటనకు కారణమైన ప్రధాన నిందితుడు డ్రైవర్ లక్షయ్య ఉలిందకొండ పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయిన విషయం తెలిసిందే. ఈ మేరకు పోలీసులు మంగళవారం రాత్రి న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టగా నవంబర్ 12 వరకు జ్యుడీషియల్ రిమాండ్ విధించారు. అయితే, కేసులో డ్రైవర్ లక్ష్మయ్య A1గా ఉండగా.. A2గా ఉన్న వేమూరి కావేరి ట్రావెల్స్ యజమాని ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. అతడి కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. కాగా, ఈ నెల 24న కర్నూలు జిల్లా చిన్నటేకూరు వద్ద ఘోర బస్సు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. బెంగుళూరు నుంచి హైదరాబాద్ వస్తున్న కావేరి ట్రావెల్స్ బస్సు పూర్తిగా అగ్నికి ఆహుతైంది. ఈ దుర్ఘటనలో మొత్తం 19 మంది సజీవ దహనం అయ్యారు. మిగితా ప్రయాణికులు ఎమర్జెన్సీ డోర్‌ను బ్రేక్ చేసి ప్రాణాలతో బయటపడ్డారు. చనిపోయిన వారి మృతదేహాలను పోలీసులు డీఎన్ఏ పరీక్షలు ద్వారా గుర్తించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. ప్రమాదంలో బైకర్ కూడా మరణించగా.. కేసులో బస్సు డ్రైవర్ వాంగ్మూలం అత్యంత కీలకంగా మారింది.

Next Story