- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కర్నూలు బస్సు ప్రమాదంలో సంచలనం.. లగేజీ క్యాబిన్‌లో వందల మొబైల్ ఫోన్లు బ్లాస్ట్!
కర్నూలు శివార్లలోని చిన్నటేకూరు సమీపంలో జరిగిన బస్సు ప్రమాదంలో మొత్తం 19 మంది సజీవ దహనమైన విషయం తెలిసిందే.

దిశ, వెబ్‌డెస్క్: కర్నూలు శివార్లలోని చిన్నటేకూరు సమీపంలో జరిగిన బస్సు ప్రమాదంలో మొత్తం 19 మంది సజీవ దహనమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఫోరెన్సిక్ టీమ్ (Forensic Team) ప్రమాద తీవ్రతకు పెరగడానికి సంబంధించి ఓ సంచలన విషయాన్ని బయటపెట్టింది. అగ్ని ప్రమాదానికి గురైన వేమూరి కావేరి ట్రావెల్స్ (Kaveri Travels) బస్సు లగేజీ క్యాబిన్‌లో తరలిస్తున్న వందల మొబైల్ ఫోన్లు పేలడం వల్లే ప్రమాద తీవ్రత పెరిగి, భారీ ప్రాణ నష్టానికి దారితీసిందని ప్రాథమికంగా టీమ్ గుర్తించింది. ముందు బస్సు ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టగానే దాని ఆయిల్ ట్యాంక్ మూత ఊడిపడి అందులోని పెట్రోల్ కారడం మొదలైందని పేర్కొన్నారు. అదే సమయంలో బస్సు కింది భాగంలో ద్విచక్రవాహనం ఇరుక్కుపోవడంతో నిప్పురవ్వలు చెలరేగడం, దానికి పెట్రోల్ తోడవడంతో మంటలు ప్రారంభమయ్యాయని పేర్కొన్నారు.
తొలుత లగేజీ క్యాబిన్‌కు మంటలు అంటుకోగా, అందులోనే 400కు పైగా మొబైల్ ఫోన్లతో కూడిన పార్సిల్ ఉండటంతో అధిక వేడికి ఆ ఫోన్ల బ్యాటరీలు బ్లాస్ అయి బస్సు పైక్యాబిన్ భాగంలోని ప్రయాణికుల కంపార్ట్‌మెంట్‌కు వ్యాపించింనట్లుగా తెలుస్తోంది. ఈ పరిణామంతో లగేజీ క్యాబిన్‌పై ఉండే సీట్లలో బెర్తుల్లో ఉన్న వారికి ప్రమాదం నుంచి బయటపడేందుకు ఆప్షన్ లేకుండా పోయిందని సమాచారం. ముఖ్యంగా సెల్‌ఫోన్ల పార్సిల్ వల్లే బస్సు మొదటి భాగంలోని సీట్లు, బెర్తుల్లో ఉన్నవారే ఎక్కువగా ప్రాణాలు కోల్పోయినట్లుగా ఫోరెన్సిక్ టీమ్ గుర్తించింది.






