ఇంకా మార్చురీలోనే కులవర్థన్ డెడ్‌బాడీ.. పలువురు నేతలపైనా కేసులు నమోదు

by Kema Shiva Kumar |

అన్నమయ్య జిల్లా మదనపల్లెలో చిన్నారిని దారుణంగా హత్య చేసిన కేసులో ప్రధాన నిందితుడు కులవర్ధన్ చెరువులో దూకి ఆత్మహత్య చేసుకోగా, ఈ కేసులో అతని తల్లి అంజమ్మను పోలీసులు A2గా చేర్చారు.

ఇంకా మార్చురీలోనే కులవర్థన్ డెడ్‌బాడీ.. పలువురు నేతలపైనా కేసులు నమోదు
X

దిశ వెబ్‌డెస్క్: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన అన్నమయ్య జిల్లా మదనపల్లె చిన్నారి హత్య కేసులో ప్రధాన నిందితుడు కులవర్ధన్ ఆత్మహత్య చేసుకున్నాడు. కురబలకోట మండలం కనసానివారిపల్లి దగ్గర ఉన్న చెరువులో నిందితుడి మృతదేహాన్ని గుర్తించారు. ముదివేడు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం తరలించారు.

కేసులో A2గా తల్లి అంజమ్మ..

నిందితుడి తల్లి అంజమ్మ పరారీలో ఉండటం, మృతదేహాన్ని తీసుకునేందుకు బంధువులెవరూ ముందుకు రాకపోవడంతో.. మృతదేహాన్ని మున్సిపాలిటీకి అప్పగించి అంత్యక్రియలు పూర్తి చేయాలని పోలీసులు భావిస్తున్నారు. తన కూతురి హత్యలో కులవర్ధన్ తల్లి అంజమ్మ పాత్ర కూడా ఉందని బాలిక తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఈ కేసులో అంజమ్మను A2గా చేర్చారు.

పలువురు నేతలపై కేసు నమోదు..

హత్య విషయం బయటకు రాగానే మదనపల్లె పట్టణంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వైఎస్సార్‌సీపీ నాయకులు ఆందోళనకు దిగి, ఇది ప్రభుత్వ వైఫల్యమేనని ఆరోపించారు. వారికి ప్రజా సంఘాలు, స్థానికులు తోడై పెద్ద ఎత్తున నిరసనలు నిర్వహించి రోడ్డును దిగ్బంధించారు. ఈ క్రమంలోనే సీపీఐ నాయకులతో పాటు ఇతర రాజకీయ, ప్రజా సంఘాల ప్రతినిధులపై పోలీసులు కేసులు నమోదు చేశారు.

Next Story