‘మీరు చేయాల్సింది ఇదే’.. బీజేపీ కార్పొరేటర్లకు కిషన్‌రెడ్డి దిశానిర్దేశం

by Gantepaka Srikanth |   (  Updated:2025-06-03 14:49:18  IST  )

GHMC కార్పొరేటర్లతో నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి(Kishan Reddy) భేటీ అయ్యారు.

‘మీరు చేయాల్సింది ఇదే’.. బీజేపీ కార్పొరేటర్లకు కిషన్‌రెడ్డి దిశానిర్దేశం
X

దిశ, వెబ్‌డెస్క్: GHMC కార్పొరేటర్లతో నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి(Kishan Reddy) భేటీ అయ్యారు. బుధవారం జరుగబోయే బల్దియా సమావేశంలో అనుసరించాల్సిన వ్యూహాలపై కార్పొరేటర్ల(BJP Corporators)కు కిషన్‌రెడ్డి దిశానిర్దేశం చేశారు. బస్తీ పర్యటనలో దృష్టికి వచ్చిన సమస్యలను జీహెచ్‌ఎంసీ కౌన్సిల్‌ సమావేశంలో లేవనెత్తాలని సూచించారు. వర్షాకాలం సన్నద్ధతపై ప్రశ్నించాలని దిశానిర్దేశం చేశారు. గుల్జార్‌హౌస్‌ అగ్నిప్రమాద ఘటనపై ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ప్రశ్నించాలని చెప్పారు. కాగా, చార్మినార్‌ గుల్జార్‌హౌస్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగి 17 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. షార్ట్‌ సర్క్యూట్‌ ద్వారా ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా అధికారులు నిర్ధారించారు. మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. మృతులకు ఒక్కొక్కరికి రూ. 5లక్షల చొప్పున పరిహారం ఇవ్వనున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటించారు.

Next Story