31 ఏళ్ల తర్వాత పోలీసులకు చిక్కిన కిల్లర్

by Malleboina Mahesh |

31 ఏళ్ల క్రితం నాటి కిడ్నాప్-హత్య కేసు నిందితుడు సలీం ఖాన్ అరెస్ట్. చనిపోయినట్లు రికార్డులు సృష్టించి, యూట్యూబర్‌గా చలామణి అవుతున్న అతడిని ఢిల్లీ పోలీసులు పట్టుకున్నారు.

31 ఏళ్ల తర్వాత పోలీసులకు చిక్కిన కిల్లర్
X

దిశ, వెబ్‌డెస్క్: ఢిల్లీ పోలీస్ క్రైమ్ బ్రాంచ్ శనివారం ఒక సంచలన కిల్లర్‌ను అరెస్ట్ చేసింది. 31 ఏళ్ల క్రితం జరిగిన 13 ఏళ్ల బాలుడి కిడ్నాప్, హత్య కేసులో ప్రధాన నిందితుడు సలీం ఖాన్ (54) ను పోలీసులు పట్టుకున్నారు. 1995లో సిమెంట్ వ్యాపారి కుమారుడిని కిడ్నాప్ చేసి హత్య చేసినందుకు 1997లో ఇతనికి కోర్టు జీవిత ఖైదు విధించింది. అయితే, 2000వ సంవత్సరంలో మధ్యంతర బెయిల్ పొందిన తర్వాత సలీం జైలుకు తిరిగి వెళ్లకుండా పరారయ్యాడు. పోలీసుల కళ్లుగప్పేందుకు అధికారిక రికార్డుల్లో తాను చనిపోయినట్లు సృష్టించుకున్నాడు.

తన గుర్తింపును పూర్తిగా మార్చుకున్న సలీం ఖాన్, 'సలీం వాస్తిక్' అనే కొత్త పేరుతో ఉత్తరప్రదేశ్‌లోని లోనీలో నివాసం ఉంటున్నాడు. అక్కడ మహిళా వస్త్ర దుకాణం నడుపుతూనే, సోషల్ మీడియాలో 'సామాజిక కార్యకర్త'గా, వివాదాస్పద యూట్యూబర్‌గా చలామణి అవుతున్నాడు. తాజాగా అతనిపై జరిగిన ఒక దాడి ఘటనపై విచారణ జరుపుతున్న క్రైమ్ బ్రాంచ్ పోలీసులు, పాత వేలిముద్రలు, ఫోటోల ఆధారంగా ఇతనే 31 ఏళ్ల క్రితం నాటి కిల్లర్ అని గుర్తించారు. దశాబ్దాల పాటు పరారీలో ఉన్న నిందితుడిని చివరకు అరెస్టు చేసి జైలుకు తరలించారు.

Next Story