ఆంధ్ర సైబర్ నేరస్తులను అరెస్ట్ చేసిన ఖమ్మం సైబర్ క్రైమ్ పోలీసులు

by Chintha Aamani |   (  Updated:2025-05-26 15:34:30  IST  )

ఆన్‌లైన్ లో ట్రేడింగ్, ఇన్వెస్ట్మెంట్ లో డబ్బులు పెడితే ఎక్కువ

ఆంధ్ర సైబర్ నేరస్తులను అరెస్ట్ చేసిన ఖమ్మం సైబర్ క్రైమ్ పోలీసులు
X

దిశ ఖమ్మం సిటీ : ఆన్‌లైన్ లో ట్రేడింగ్, ఇన్వెస్ట్మెంట్ లో డబ్బులు పెడితే ఎక్కువ లాభాలు వస్తాయని నమ్మించి, సుమారు రూ.1.62 కోట్ల రూపాయలు మోసం చేసిన కేసులో ముగ్గురు వ్యక్తులను ఖమ్మం సైబర్ క్రైమ్ పోలీసులు ఆంధ్ర లోని విజయవాడలో అరెస్టు చేసినట్లు ఖమ్మం సీపీ. సునీల్ దత్ తెలిపారు. కేసు వివరాల్లోకి వెళితే ఖమ్మం జిల్లాలోని బోనకల్ మండలానికి చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ కి ఫోన్ చేసి ఆన్లైన్ లో ట్రేడింగ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే అధిక లాభాలు వస్తాయని ఆశ చూపి వాట్సప్ ,ట్రేడింగ్ లింకుల ద్వారా సుమారురూ.1.62 కోట్లు ఇన్వెస్ట్మెంట్ చేసి మోసపోయిన కేసులో, కొంత డబ్బు అకౌంటికి వెళ్ళిన షేక్ సుభాని, వయసు 38 సం.రాలు అరెస్టు చేసి విచారించగా తను, ఇంకో ఇద్దరు దాసరి సునీల్ కుమార్ వయస్సు 37 సం.రాలు మరియు సుదలగుంట్ల సాయి క్రిష్ణ వయసు 30 సం.రాలతో కలిసి నేరం చేసినట్లు ఒప్పుకున్నాడు. అట్టి ముగ్గురిని ఎన్టీఆర్ జిల్లాలోని విజయవాడలో అరెస్ట్ చేసినట్లు, ముగ్గురు నిందుతులను ఖమ్మం సైబర్ క్రైం కోర్టులో హాజరు పరిచి, రిమాండ్ కి తరలించినట్లు తెలిపారు. ఈ కేసు విచారణలో ముఖ్య పాత్ర వహించిన సైబర్ క్రైం డి.ఎస్పీ సి ఎచ్ ఫణిందర్ ని, ఇన్స్పెక్టర్ యాసీన్ అలీ ని, ఎస్సై లు రంజిత్ కుమార్, విజయ్ కుమార్ , సైబర్ క్రైం పోలీస్ స్టేషన్ సిబ్బందిని ఖమ్మం సీపీ అభినందించారు.

Next Story