PNB కుంభకోణం కేసులో కీలక మలుపు.. నెహాల్ మోడీ అరెస్ట్

by Kema Shiva Kumar |   (  Updated:2025-07-05 10:01:57  IST  )

పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటూ పరారీలో ఉన్న వ్యాపారవేత్త నీరవ్ మోడీ (Nirav Modi) సోదరుడు నెహాల్ మోడీ (Nehal Modi) ఎట్టకేలకు అమెరికాలో అరెస్ట్ అయ్యాడు.

PNB కుంభకోణం కేసులో కీలక మలుపు.. నెహాల్ మోడీ అరెస్ట్
X

దిశ, వెబ్‌డెస్క్: పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటూ పరారీలో ఉన్న వ్యాపారవేత్త నీరవ్ మోడీ (Nirav Modi) సోదరుడు నెహాల్ మోడీ (Nehal Modi) ఎట్టకేలకు అమెరికాలో అరెస్ట్ అయ్యాడు. ఈ మేరకు అమెరికా జస్టిస్ డిపార్ట్‌మెంట్ భారత అధికారులకు అరెస్టు విషయాన్ని అధికారంగా తెలియజేసింది. కేసులో కీలక ఆరోపణలు ఎదుర్కొంటున్న నెహాల్ మోడీని అరెస్ట్ చేయాలంటూ ఇప్పటికే కేంద్ర దర్యాప్తు సంస్థ (CBI), ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) అమెరికా ప్రభుత్వానికి ఎక్స్‌ట్రాడిషన్ కింద అభ్యర్థనలు పంపింది. కుంభకోణం జరిగిన తర్వాత నిందితులు తిరిగి దేశాలకు తీసుకొచ్చేలా ఇంటర్‌పోల్ రెడ్ కార్నర్ నోటీసు కూడా జారీ చేసింది. పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో జరిగిన రూ.13 వేల కోట్లపైగా కుంభకోణంలో నీరవ్ మోడీతో పాటు నెహాల్ మోడీ కూడా ప్రధాన నిందితుడని ఈడీతో పాటు సీబీఐ గుర్తించింది. ప్రస్తుతం అరెస్ట్ అయిన నెహాల్ మోడీ అమెరికా పోలీసుల కస్టడీలో ఉన్నాడు.

Next Story