Police: వీరరాఘవకు గతంలోనూ నేర చరిత్ర ఉంది.. ఇప్పుడు అరెస్ట్ చేయకపోతే చాలా కష్టం

by Gantepaka Srikanth |

చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్‌(Priest Rangarajan)పై దాడి కేసులో ప్రధాన నిందితుడు వీర రాఘవరెడ్డి(Veera Raghava)తో పాటు మరో ఐదుగురిని అదుపులోకి తీసుకుని రిమాండ్‌కి తరలించిన విషయం తెలిసిందే.

Police: వీరరాఘవకు గతంలోనూ నేర చరిత్ర ఉంది.. ఇప్పుడు అరెస్ట్ చేయకపోతే చాలా కష్టం
X

దిశ, వెబ్‌డెస్క్: చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్‌(Priest Rangarajan)పై దాడి కేసులో ప్రధాన నిందితుడు వీర రాఘవరెడ్డి(Veera Raghava)తో పాటు మరో ఐదుగురిని అదుపులోకి తీసుకుని రిమాండ్‌కి తరలించిన విషయం తెలిసిందే. తాజాగా.. వీరరాఘవ రిమాండ్‌ రిపోర్టు(Veera Raghava Remand Report)లో పోలీసులు కీలక అంశాలు పేర్కొన్నారు. ఇందులోనే అరెస్ట్‌కు సంబంధించిన కారణాలను వెల్లడించారు. ‘శివుడి అవతారంగా వీరరాఘవ తనను తాను క్రియేట్‌ చేసుకున్నారు. దుష్టశిక్షణ, శిష్ట రక్షణ పేరుతో వీడియోలు చేశారు. వీటితోనే రామరాజ్యం సాధ్యమని ప్రచారం చేశారు. రామరాజ్యం పేరుతో దోపిడీకి పాల్పడ్డారు. అనేక మంది పూజారులపై భౌతిక దాడులకు పాల్పడ్డారు. వీరరాఘవకు గతంలోనూ నేరచరిత్ర ఉంది. ఇప్పుడు అతన్ని అరెస్టు చేయకపోతే.. శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుంది’ అని రిమాండ్ రిపోర్ట్‌లో పోలీసులు పేర్కొన్నారు.

కాగా.. చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్‌పై దాడితో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చిన వీర రాఘవరెడ్డి గురించి ఆరా తీసినా కొద్ది కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మ్యూజిక్‌ టీచర్‌గా కెరీర్‌ మొదలుపెట్టిన వీరరాఘవ రెడ్డి.. ప్లాన్ ప్రకారం ప్రైవేట్‌ ఆర్మీని రెడీ చేసుకున్నారు. కోసలేంద్ర ట్రస్ట్ పేరుతో రామరాజ్యం ఆర్మీ(Rama Rajyam army) ఏర్పాటు చేసి మొదటి స్లాట్‌లో 5 వేల మందిని రిక్రూట్ చేసుకోవాలని టార్గెట్‌గా పెట్టుకున్నాడు. 20 నుంచి 50 ఏళ్ల లోపు వయస్సు ఉన్నవాళ్లను రిక్రూట్‌ చేసుకొని తాను చెప్పిన పని చేయాలని కండిషన్ పెట్టారు. ఈ క్రమంలోనే ఆయన ఆర్మీతో అనేక మంది ఆలయ పూజారులపై దాడులు చేశారు. చివరగా రంగరాజన్‌పై దాడి ఘటన తర్వాత ఆయన నేర చరిత్ర వెలుగులోకి వచ్చింది.

Next Story