- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బాలికను హత్యచేసి రాత్రంతా మద్యం తాగుతూ.. మదనపల్లె హత్యకేసులో వెలుగులోకి కీలక విషయాలు
అన్నమయ్య జిల్లా మదనపల్లెలో ఏడేళ్ల బాలికపై కులవర్ధన్ అనే వ్యక్తి అత్యాచారానికి పాల్పడి దారుణంగా హత్య చేసిన సంగతి తెలిసిందే. అనంతరం పోలీసులు తీసుకెళుతుండగా నిందితుడు చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

దిశ, వెబ్ డెస్క్: అన్నమయ్య జిల్లా మదనపల్లెలో ఏడేళ్ల బాలికపై కులవర్ధన్ అనే వ్యక్తి అత్యాచారానికి పాల్పడి దారుణంగా హత్య చేసిన సంగతి తెలిసిందే. అనంతరం పోలీసులు తీసుకెళుతుండగా నిందితుడు చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కాగా ఈ ఘటనలో షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి. బాలికను హత్య చేసిన కులవర్ధన్ అనుమానం రాకుండా పాప తల్లిదండ్రులు, బంధువులతో మాట్లాడినట్టు చెబుతున్నారు. సోమవారం బాలిక ఇంటికి వెళ్లి చిన్నారిని వెతుకుతున్నారా? కనిపించిందా.. అంటూ ఏమీ తెలియనట్టు చుట్టుపక్కలవారిని ఆరా తీసినట్టు తెలిసింది. సోమవారం రాత్రంతా మృతదేహాన్ని బయటకు తరలించడం వీలుకాక ఇంట్లోనే ఉండిపోయినట్టు తెలుస్తోంది.
ఇక మంగళవారం ఉదయం పోలీసులు కులవర్ధన్ ఇంటికి వెళ్లగానే పై కప్పు కిటీకీ లో నుండి తొంగిచూసి పడుకున్నట్టు నటించాడు. దీంతో అనుమానం వచ్చిన పోలీసులు డోర్ పగలగొట్టి లోపలకు వెళ్లారు. వెళ్లిన వెంటనే నా పనైపోయింది సార్.. అంటూ కులవర్ధన్ షాక్ అయినట్టు ఓ అధికారి, పాప బంధువులు చెబుతున్నారు. ఇళ్లంతా వెతికిన పోలీసులు చివరికి డ్రంబ్ పై కప్పు తీసి చూడగా అందులోనే డెడ్ బాడీని గుర్తించారు. దొరికిపోయిన అనంతరం కూడా నిందితుడు.. మూడు నెలల్లో వస్తా.. అప్పుడు చూస్తా అంటూ పోలీసులనే హెచ్చరించినట్టు చెబుతున్నారు. బాలికను హత్య చేసిన అనంతరం రాత్రంతా నిందితుడు మద్యం తాగాడని గదిలో ఐదారు మద్యం సిసాలు ఉన్నాయని పోలీసులు గుర్తించారు.






