- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఫాల్కన్ స్కామ్ కేసులో కీలక పరిణామం.. ప్రధాన నిందితుడు అమర్‌దీప్ జెట్ విమానం సీజ్
ఫాల్కన్ స్కామ్ కేసు(Falcon Scam Case)లో కీలక పరిణామం చోటుచేసుకున్నది.

దిశ, వెబ్‌డెస్క్: ఫాల్కన్ స్కామ్ కేసు(Falcon Scam Case)లో కీలక పరిణామం చోటుచేసుకున్నది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న అమర్‌దీప్ జెట్ విమానాన్ని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(Enforcement Directorate) అధికారులు సీజ్ చేశారు. ఇద్దరు నిందితులు పవన్, కావ్యను కూడా అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం కీలక నిందితులు అమర్‌దీప్ సహా పలువురు పరారీలో ఉన్నట్లు అధికారులు చెప్పారు.
కాగా, తమ కంపెనీలో డిపాజిట్లు పెడితే తక్కువ కాలంలోనే ఎక్కువ లాభాలు ఇస్తామంటూ నమ్మించి 6979 మందికి అమర్‌దీప్(Amardeep) కుచ్చుటోపీ పెట్టాడు. ఈ స్కామ్‌పై (Falcon Scam) ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) కేసు నమోదు చేసింది. హైదరాబాద్ కేంద్రంగా సాగిన ఈ స్కామ్‌లో దేశవ్యాప్తంగా రూ.1700 కోట్లు వసూలు చేసినట్లు గుర్తించారు. వీటిని వివిధ రూపాల్లో 14 కంపెనీలలో అమర్‌దీప్ పెట్టుబడులు పెట్టాడు. విషయం బట్టబయలై కేసు నమోదు కావడంతో కంపెనీ యజమానులు కొందరు డిపాజిటర్లకు రూ.850 కోట్లు తిరిగి చెల్లించగా ఇంకా రూ.850కోట్లు చెల్లించాల్సి ఉందని చెప్పారు. ఈ డబ్బులతోనే రూ.14 పెట్టి ప్రయివేట్ జెట్ విమానం కొనుగోలు చేసినట్లు అధికారులు గుర్తించారు. కేసులో దర్యాప్తు మమ్మరం అయిన విషయం తెలుసుకుని ప్రయివేట్ జెట్‌లో దుబాయ్ పారిపోయినట్లు అధికారులు తెలిపారు.






