- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాజలింగమూర్తి హత్య కేసులో కీలక పరిణామం.. పోలీసు కస్టడీలోకి నిందితులు
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన, నాగవెల్లి రాజలింగమూర్తి హత్య కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది.

దిశ, వెబ్‌డెస్క్: జయశంకర్ భూపాలపల్లి (Jaishankar Bhupalapally) జిల్లా కేంద్రంలో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన, నాగవెల్లి రాజలింగమూర్తి (Nagavelli Rajalingamurthy) హత్య కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. నిందితులను పోలీసు కస్టడీకి అనుమతించాంటూ భూపాలపల్లి పోలీసులు ఇటీవలే పిటిషన్ దాఖలు చేశారు. ఈ మేరకు వారి పిటిషన్‌పై విచారణ చేపట్టిన జిల్లా కోర్టు జూనియర్ సివిల్ జడ్జి రామచంద్రరావు (Ramachandra Rao) నిందితులను పోలీసు కస్టడీకి ఇస్తున్నట్లుగా ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో నిందితులు రేణుకుంట్ల సంజీవ్, పింగిళి సీమంత్, మోరె కుమార్, దాసారపు కృష్ణ, కొత్త హరిబాబును నేటి నుంచి ఈనెల 4 వరకు అంటే మొత్తం మూడు రోజుల పాటు పోలీస్ కస్టడీలో ఉండనున్నారు. హత్యకు సంబంధించి మరిన్ని వివరాలు, సమాచారాన్ని సేకరించేందుకు నిందితులను భూపాలపల్లి పోలీసులువేర్వేరుగా విచారించనున్నారు.






