ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ కేసులో కీలక పరిణామం.. మరో ఉగ్రవాది షోయబ్ అరెస్ట్

by Kema Shiva Kumar |

దేశ రాజధాని ఢిల్లీలోని రెడ్ ఫోర్ట్ సమీపంలో నవంబర్ 10న జరిగిన ఘోర కారు బాంబు పేలుడు కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) దర్యాప్తును వేగవంతం చేసింది.

ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ కేసులో కీలక పరిణామం.. మరో ఉగ్రవాది షోయబ్ అరెస్ట్
X

దిశ, వెబ్‌డెస్క్: దేశ రాజధాని ఢిల్లీలోని రెడ్ ఫోర్ట్ సమీపంలో నవంబర్ 10న జరిగిన ఘోర కారు బాంబు పేలుడు కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) దర్యాప్తును వేగవంతం చేసింది. అయితే, ఈ దాడికి ముందు ఉగ్రవాది ఉమర్ ఉన్ నబీకి సహాయం అందించిన ఆరోపణలపై హర్యానాలోని ఫరీదాబాద్‌కు చెందిన షోయబ్‌ను ఇవాళ ఎన్‌ఐఏ అధికారులు అరెస్టు చేశారు. ఫరీదాబాద్ జిల్లాలోని ధౌజ్ గ్రామానికి చెందిన షోయబ్ ఈ కేసులో A7గా ఉన్నాడు. అటాక్‌కు ముందు కొద్ది రోజులు ఉగ్రవాది ఉమర్ ఉన్ నబీని తన ఇంట్లోనే దాచినట్లు గుర్తించారు. అతడికి ట్రాన్స్‌పోర్టు, ఇతర లాజిస్టిక్ సహాయం అందిస్తూ.. ఉమర్ పోలీసుల కంట పడకుండా ఉండేలా షోయబ్ సహకరించినట్లు తెలుస్తోంది.

కాగా, పేలుడులో మృతి చెందిన కారు డ్రైవర్ జమ్మూ కాశ్మీర్‌లోని పుల్వామా జిల్లా సంబూరా గ్రామానికి చెందిన డాక్టర్ ఉమర్ ఉన్ నబీ (32) అని ఫోరెన్సిక్ పరీక్షల ద్వారా గుర్తించిన విషయం తెలిసిందే. అతడు హర్యానాలోని అల్-ఫలా యూనివర్శిటీలో జనరల్ మెడిసిన్ అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తూ, 2024 మార్చి నుంచి ఢిల్లీలో ఉంటున్నాడు. తల్లి డీఎన్ఏ నమూనా ద్వారా అతడి గుర్తింపును కూడా ధృవీకరించారు.

Next Story